వినుకొండ: పులివెందుల నియోజకవర్గం పుంగనూరులో టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనపై వైసీపీ గుండాలు దాడి అమానుషమని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, జెడ్ ప్లస్ కేటగిరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పర్యటనపై వైసిపి గుండాలు దాడి చేస్తుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. పోస్టింగుల కోసం పోలీసులు శాంతి,భద్రతలను సర్వనాశనం చేస్తూ సీఎంకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లోకేష్ యువగళం పాదయాత్రకు, చంద్రబాబు పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న అక్క సుతో వైసిపి దుర్మార్గాలకు,దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టిడిపి బ్యానర్లు తొలగించి వైసిపి దాడులు చేస్తే భద్రత కల్పించాల్సిన పోలీసులు పూర్తి వైఫల్యం చెందారన్నారు. పోలీసులకు భద్రత కల్పించడం చేతకాదని చెబితే తమ ప్రాణాలను తామే కాపాడు కుంటామని, దాడికి ప్రతిదాడే శరణ్యమని అన్నారు. నేడు పుంగనూరులో జరిగిన విధంగానే వినుకొండలో ఎమ్మెల్యే టిడిపి కార్యకర్తలపై దాడి చేయించి తీవ్రంగా గాయ పరిచారని ఇటువంటి రౌడీ మూకాలకు తగిన విధంగా వైసిపి అల్లరిమూకల అరాచక విధానాలను అరికట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలకు రక్షణ కల్పించాలని ,చేతకాకపోతే డిజిపి ప్రకటించాలని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాజు పాల్గొన్నారు.










