Aug 07,2023 21:24

సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌, పక్కన శత్రుచర్ల, టిడిపి నాయకులు

కురుపాం: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో శత్రుచర్ల కోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఈనెల 9న తోటపల్లి ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నారని, రైతులతో ప్రత్యేక సమావేశం ఉంటుందని తెలిపారు. కావున టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, సాలూరు, కురుపాం నియోజకవర్గాల టిడిపి ఇన్‌ఛార్జులు గుమ్మడి సంధ్యారాణి, టి.జగదీశ్వరి, నియోజకవర్గం పరిశీలకులు ఆరేటి మహేష్‌, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సీతానగరం : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇన్‌ఛార్జి బోనెల విజరుచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం కె.కిషోర్‌ ఇంటి వద్ద టిడిపి మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పర్యటనలో కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి కదిలించేలా ప్రయత్నం చేయాలన్నారు. వైపిసి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టేందుకు ఈ బహిరంగ సభ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు, రైతు వేణుగోపాల్‌ నాయుడు, మండల కమిటీ నాయకులు సాల హరిగోపాలరావు, దామినేని భానుప్రసాద్‌, ఎస్‌.శ్రీనివాసరావు, పెదబాబు, సర్పంచి జొన్నాడ తెరేజమ్మతో పాటు వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్‌ : టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న పార్వతీపురంలో పర్యటిస్తున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి అన్నారు. పట్టణంలోని కొత్తవలసలో గల టిడిపి నాయకులతో కలిసి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని సోమవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్‌, నాయకులు కోలా మధు, సిరిపురపు భాస్కరరావు, సందక దేశాలు, మీసాల రమణ, సారికిగణేష్‌, సుంకరి రమణ, తదితరులు పాల్గొన్నారు.