మదనపల్లె అర్బన్ : నీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం మదనపల్లె నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3వ తేదీన నారా చంద్రబాబునాయుడు పర్యటన ముగించుకుని కొక్కంటి క్రాస్‌లో రాత్రి బస చేసి 4వ తేదీ ఉదయం బయలుదేరి మదనపల్లెకు 10 గంటలకు చేసుకుంటారని తెలిపారు. స్థానిక ప్రజలతో సమావేశం అనంతరం మదనపల్లె దాహార్తిని తీర్చడానికి నిర్మాణం చేపట్టిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పరిశీలన చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త మదనపల్లె చేరుకోవాలని పిలుపునిచ్చారు. వైసిపి పాలనలో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం జరుగు తోందని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పాలనలో ఎలాంటి అవినీతి దుర్వినియోగం జరగలేదని నేడు ఇసుక, లిక్కర్ గనుల మాఫియా చెలరేగిపోతోందని నిప్పులు చేరిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతోపాటు అభివద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు షంషీర్, నాగుర్‌వల్లి, నాదెళ్ల శివ, గిరీష్, రమణ, రఘుపతి పాల్గొన్నారు.










