Apr 09,2023 22:33

ప్రజాశక్తి-విజయవాడరూరల్‌ : ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి కష్ణాజిల్లాకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ విజయవాడ రూరల్‌ మండల విస్తత సమావేశం తీర్మానించింది. సమావేశం ఆదివారం ప్రసాదంపాడులో జరిగింది. ఈనెల 12 న మచిలీపట్నం రోడ్‌ షో, బహిరంగ సభ,13 న గుడివాడలో రోడ్‌ షో, బహిరంగ సభ,14 న గుడివాడలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నందున గుడివాడలో జరిగే బహిరంగ సభ కూడా జయప్రదం చేయాలని గన్నవరం నియోజకవర్గ సహాయ కో- ఆర్డీనేటర్‌ బచ్చుల సుబ్రహ్మణ్యం కోరారు.ఈ సమావేశం లో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ చిరుమామిళ్ళ సూర్యం,రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గూడవల్లి నరసింహరావు, సీనియర్‌ నాయకులు బొప్పన హరికష్ణ,జిల్లాపార్టీ ఉపాధ్యక్షులు గుజ్జర్లపూడి బాబురావు, దండు సుబ్రమణ్యం రాజు,వాణిజ్య విభాగ నాయకులు అద్దేపల్లి సాంబశివరావు, రూరల్‌ మహిళా అధ్యక్షురాలు నెక్కంటి శ్రీదేవి,గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పరుచూరి నరేష్‌,పరిటాల గణేష్‌,గంపా శ్రీనివాస్‌ యాదవ్‌,లంకపల్లి యోగేశ్వరవు,గుంటక సుబ్బారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.