ప్రజాశక్తి-అద్దంకి: శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును అనపర్తిలో పర్యటనను అడ్డుకున్నందుకు నిరసిస్తూ పట్టణంలోని పోతురాజుగండిలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలు దేరి బస్టాండ్ మీదుగా బంగ్లారోడ్డులోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెదేపా నేతలు వినతిపత్రం శనివారం అంద జేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పోలీసులు పర్యటనకు అనుమతి ఇచ్చి రెండు రోజులు సభలు విజయవంతం కావడంతో అడ్డుకోవడం అప్రజా స్వామికమని పేర్కొన్నారు. చంద్రబాబు రోడ్డుషోలో జన ప్రభంజనంతో జగన్‌రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలతో తాడేపల్లి పునా దులు కదులుతున్నాయని, నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. అనపర్తిలో చంద్రబాబు ప్రసగించకుండా పోలీసులను ఉపయోగించి బహిరంగ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనపర్తి సభకు జిల్లా పోలీసుల నుంచి అన్ని అను మతులు తీసుకున్నా అకారణంగా సభకు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం అప్రజాస్వామికం. సంక్షేమ పథకాల పేరిట రూ.10 పంచిపెట్టి రూ.100 కోట్టేస్తున్న జగన్‌రెడ్డి అసలు మోసాన్ని ప్రజలు గుర్తించారు. ఏదో ఒక పథకం పేరు చెప్పి ఉదయం బటన్ నొక్కి సాయంత్రం మద్యం విక్రయాల రూపంలో దోచుకుంటున్నాడు. దోపిడీ చేయడం తప్ప జగన్ ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదు. చెత్తపై పన్ను వేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. వైసీపీ పాలనలో జనం విసుగు చెందారని. కాబట్టే సైకో పాలన పోవాలి. సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుం టున్నారని అన్నారు. సభకు ఉదయం అనుమతి ఇచ్చి సాయంత్రం రద్దు చేయటం ఏమిటని ప్రశ్నించారు. జగన్ చెప్పినట్టు విని కొందరు పోలీసులు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నాని అన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం లోకి వచ్చి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్విని యోగం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో జనం విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని నేతలు ఉద్ఘాటించారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాక్షసత్వం ప్రదర్శిస్తున్న జగన్‌రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. దేశంలో ఎక్కడాలేని ఆంక్షలు ఈ రాష్ట్రంలోనే పెట్టడం జగన్‌రెడ్డి ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సభకు ఉదయం అనుమతి ఇచ్చి సాయంత్రం రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. సైకో జగన్ చెప్పినట్లు విని పోలీస్ అధికారులు తమ వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికం, నిజంగా దిగజారుడుతనమని ఇకనైనా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల పట్టణ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్‌ఛార్జులు, తెలుగు మహిళా, తెలుగు యువత, ఎస్‌సి సెల్, సాంస్కతిక, ఐటీడీపీ, బీసీ సెల్, మైనారిటీ, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.










