
ప్రజాశక్తి-సాలూరు రూరల్ : చంద్రబాబునాయుడు జీవితంలో ఏనాడూ, ఏ తప్పూ చేయరని, 45 రోజులుగా అన్యాయంగా జైల్లో పెట్టారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి అన్నారు. గురువారం మండలంలో కురుకుట్టిలో బాబుతో నేను కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. జీవితంలో నిరంతరం యువత ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నిరంతరం తపించారని తెలిపారు. అటువంటి వ్యక్తి తప్పు చేశారని ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసి అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పారు. ఆ తప్పుడు కేసుల నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు, అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చంద్రబాబునాయుడును అన్యాయంగా జైల్లో పెట్టారని వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్, కూనిశెట్టి భీమారావు, దొర లక్ష్మణ, అక్యానా తిరుపతిరావు, తాడుతూరి తిరుపతిరావు, శ్యామ్ పాల్గొన్నారు.