ప్రజాశక్తి-పంగులూరు: వైసిపిపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపైన ప్రజలు చూపుతున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక అవాకులు చవాకులు పేలుతున్న చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు మొత్తం రద్దు చేస్తాడని, పేదల బతుకులు చిన్నాభిన్నం చేస్తాడని వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. గురువారం పంగులూరులోని మండల పరిషత్ కార్యాలయం దగ్గర జరిగిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేయడానికి తాయిలాలు ప్రకటిస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నాడని, ఎన్ని మోసపు మాటలు చెప్పినా ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్‌రెడ్డిని ఆదరిస్తారని కృష్ణ చైతన్య అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజల కష్టాలను తీర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసిపిని ప్రజలు మరోసారి గెలిపించి అధికారం అందించాలని కోరారు. అధికారం చేపట్టినప్పటి నుంచి కరోనా సమయంలో కూడా జగన్ మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన నిలబడి ప్రజలను కాపాడుకునేందుకు కృషి చేశారని అన్నారు. అర్హులైన పెన్షన్ దారులు అందరికీ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో పంగులూరు గ్రామ సర్పంచి గుడిపూడి నాగేంద్రమ్మ, ఎంపీడీవో రామాంజనేయులు, ఎంపీపీ తేల్లనాగమ్మ, జడ్పిటిసి రాయిని ప్రమీల, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాయని వెంకట సుబ్బారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్‌రెడ్డి, వైసీపీ నియోజకవర్గ ప్రచార అధ్యక్షులు జంపానీ రవిబాబు, వైసిపి నాయకులు గుడిపూడి రామారావు, నల్లమల అజిల్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










