May 31,2023 23:54

పాలాభిషేకం చేస్తున్న మహిళా నాయకులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహానాడులో టిడిపి ప్రకటించిన మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ బండలు, ప్రతి నెల రూ 1500లతో పాటు బస్సులో ఉచిత ప్రయాణానికి ప్రకటించడంతో ఆ పార్టీ మహిళ అధ్యక్షురాలు ఎం.జానికమ్మ, ఎంపిటిసి ఎం.గీత ఆధ్వర్యాన బుధవారం చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు టి.సుబ్బారావు, సీనియర్‌ నాయకుడు కె.సుబ్బారావు, టిఎన్‌టియుసి పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి తదితరులు పాల్గొన్నారు.