Oct 31,2023 21:10

రాజంపేట :జగన్‌మోహన్‌రాజు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్న టిడిపి శ్రేణులు

రాజంపేట అర్బన్‌ : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మధ్యంతర బెయిల్‌ మంజూరు నేపథ్యంలో మంగళవారం రాజంపేట పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చంగల్రాయుడు ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌ రాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి, ఎన్టీఆర్‌ విగ్రహానికి గజమాలవేసి టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పటికీ న్యాయం ఎదుట నిజం గెలిచిందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలకడ : చంద్ర బాబు మధ్యంతరం బెయిల్‌పై విడుదల కావడంతో మండలంలోని టిడిపి, కార్యకర్తలు అభిమానులు సంబరాలు నిర్వహించ ుకున్నారు. తెలుగు తమ్ముళ్లు మండల కేంద్రమైన కలకడ నడిరోడ్డు పైన టపాకా యలు పేల్చి, కేక్‌కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజే సుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు ఉపాధ్య క్షులు రవి ప్రకాష్‌ నాయుడు, మాజీ జడ్‌పిటిసి తిరుపతి నాయుడు, మాజీ మండల అధ్యక్షులు మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ బరకం శ్రీనివాసు లురెడ్డి ,మండల పార్టీ మైనార్టీ అధ్యక్షులు కరీముల్లా బాషా, పట్టణ అధ్యక్షులు జిలానిబాషా, కాంతారావు, జనార్ధన్‌ నాయుడు, జిరాక్స్‌ అల్లి పాల్గొన్నారు. నిమ్మనపల్లి : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్‌ స్కాం కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంపై మండలం లోని టిడిపి నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకు న్నారు. కార్యక్రమంలో టిడిపి తెలుగు యువత మండల అధ్యక్షులు చిన్నబాబు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీలేరు : బాబుకు న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో పట్టణంలోని శ్రీ వివేకానంద సర్కిల్లో టిడిపి శ్రేణులు సమావేశమై టపాకాయలు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల స్థాయి పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మదనపల్లె అర్బన్‌ : నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొమ్మలపాటి రమేష్‌ అదేర్యంలో టిడిప జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్‌ ప్రకటించటంతో పార్టీ శ్రేణులతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో భాణసంచ కాల్చి వేడుకలు నిర్వహించారు. పెద్దమండ్యం : నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ సూచనలతో పెద్దమండ్యం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు జిట్టా వెంకటరమణ ఆధ్వర్యంలో మూడు రోడ్డుల కూడలిలో బాణా సంచాపెద్ద ఎత్తునకాల్చి, కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో తెలుగు యుత అధ్యక్షులు నారా గంగాధర్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జిలు నటరాజ్‌నాయక్‌, రఘనాదయాదవ్‌, రైతు విభాగ అధ్యక్షులు తుమ్మల మహేశ్వర, గ్రామ అధ్యక్షులు పెద్దన్న, బబ్జాన్‌ , రామాంజులు తులసిదర్‌ నాయుడు, నారా శ్రీనివాసులు,భరత్‌, సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. ములకలచెరువు : మండల కన్వీనర్‌ సిద్ధ అధ్వ ర్యంలో జాతీయ రహదారిపై తెదేపా భారీ ఎత్తున బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్ర రాజకీయాలు చేసి చంద్రబాబు ఆరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు కెవి రమణ, కట్టా హరి, రమణ మూర్తి, ఆదినారాయణ, ఆదిమూర్తి పాల్గొన్నారు. రైల్వేకోడూరు : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన సంద ర్భంగా టిడిపి శ్రేణులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుప ుకున్నారు. టిడిపి ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథనాయుడు, సీనియర్‌ నాయ కులు, పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, మాజీ ఎంపిపి వెంకటేశ్వర రాజు, మాజీ జడ్‌పిటిసి నాయుడోరి రమణ, కమతం నాగరాజు బాణాసంచా కాల్చి, రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. లక్కి రడ్డిపల్లి :చంద్ర బాబుకు మధ్యంతర బెయిల్‌ రావడంతో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్య కర్తలు సంబ రాలు జరుపుకున్నారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్‌ చెండ్రా యుడు, రాఘవేంద్ర, గౌస్‌ పీర్‌, గురుస్వామి పాల్గొన్నారు.రామాపురం : టిడిపి అధినేత చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు కావడంతో మం డల టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలను జరుపు కున్నారు. ఈ సందర్భంగా చిట్లూరు సరస్వతిపల్లె, రాచపల్లి హాసనాపురం, కసిరెడ్డి గారిపల్లి, గోపగుడ ిపల్లి కుమ్మరపల్లి. తదితర గ్రామాలలో టిడిపి నాయకులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు రామకష్ణ గౌడ్‌, మదన మోహన్‌ రెడ్డి. రాంబశిరెడ్డి, ఆజాం, రామ్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. గాలివీడు : చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అక్రమ అరెస్టులతో ఏమి చేయలేరన్నారు.చంద్రబాబు బెయిల్‌ మంజూరుకావడం హర్షణీయ మన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బి.కె మహమ్మద్‌ రియాజ్‌, కేడియం లక్ష్మయ్య, కొండ్రెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, సత్యారెడ్డిపాల్గొన్నారు. రాయచోటి : చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంతో శుభప్రదమని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి, స్వీట్స్‌ పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ రూరల్‌ అధ్యక్షులు బోనమల ఖాదరవల్లి, మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, జడ్పిటిసి మాజీ జడ్పిటిసి నర్సారెడ్డి టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు విడుదలపై టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు సుగువాసి ప్రసాద్‌ బాబు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మయాన ఇర్శాద్‌ ఖాన్‌, ఖాదర్‌హుసేన్‌, ఖలీల్‌,బాషా, నవాజ్‌, ఫరూక్‌, షకీల్‌, వాజిడ్‌, సయ్యద్‌, అన్వర్‌, జవీద్‌, ఎర్రమస్తాన్‌, ఫిరోజ్‌ సాధిక్‌, జమాల్‌, ఖాదర్‌బాషా, బాషా, సైఫుల్లా, కరామత్‌, షబ్బీర్‌, సుగవాసి శ్రీనివాసులు, లాయర్‌ సతీష్‌ రెడ్డి,మన్నూరు రాజశేఖర్‌, పసుపులేటి నాగేంద్ర, ఏనుగుల విశ్వనాథ, కిషోర్‌ చౌదరి, మంత్రి రెడ్డయ్య, మన్నెర రామాంజనేయులు పాల్గొన్నారు. ఎస్‌ఎన్‌ కాలనీలో మండిపల్లి భవన్‌ వద్ద టిడిపి నియోజకవర్గ నాయకులు మండపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ మంజూరు కావడంపై స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.