
ప్రజాశక్తి -పెనుకొండ : చంద్రబాబు ఆరోగ్యంపై కోర్టు జోక్యం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ డిమాండ్ చేశారు. చంద్ర బాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా శనివారం పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ వద్ద నుండి నల్ల బెలూన్లతో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్బంగా సవితమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యంపై జగన్ ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని బయటకు పంపుతోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల రిపోర్టు కాకుండా సజ్జల స్క్రిప్టును అధికారులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. జైల్లో అపరిశుభ్రత వాతావరణం, కలుషిత నీటిని సప్లై చేయడం వల్లే చంద్రబాబుకు అలర్జీ వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవనాయుడు, రాంపురం సర్పంచి శ్రీనివాసులు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, సీపీఐ శ్రీరాములు, గుట్టూరు మాజీ సర్పంచి సూర్యనారాయణ, అడదాకులపల్లి మాజీ సర్పంచి ప్రసాద్, రామకృష్ణారెడ్డి, తివేంద్ర, మాజీ ఎంపీటీసీ రమణమ్మ, మాజీ వైస్ సర్పంచి సుబ్రహ్మణ్యం మాగే చెరువు సర్పంచి నరసింహులు, మారుతి ప్రసాద్, చిన్నపోతన్న, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరాపురం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మండల కన్వీనర్ గణేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆధారాలు లేని అక్రమ అరెస్టు నిలవలేవని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి, కృష్ణమూర్తి, మాజీ కన్వీనర్ శివరుద్రప్ప, మండల ప్రధాన కార్యదర్శి జయరాం, మాజీ ఎంపీపీ రామిరెడ్డి, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి దాదు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు రఘు, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల: చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు పట్టణంలో శనివారం తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్, కార్యదర్శి నరేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, యనమల గంగాధర్, మంజునాథ్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : చంద్రబాబు ఆరోగ్యంపై కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని మెరుగైన వైద్యం సేవలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గుడిబండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పై ఏ ఆధారాలు లేని కేసులు బనాయించి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి కూడా నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
మడకశిర రూరల్ : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే ఈరన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వ విఫలమైందన్నారు. చంద్రబాబు నాయుడుడి ఏమైనా జరిగితే జగన్ మోహన్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఆదినారాయణ, అశ్వత్థామప్ప, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : చంద్రబాబును అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ జగన్ నాలుగు సంవత్సరాల పాలనలో రాష్ట్రం అధోగతి పట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, కన్వీనర్ మల్లిరెడ్డి, మాజీ సర్పంచి సాకే యశోద రాయుడు, మాజీ ఎంపీపీ బాలు, మీసాల మురళి, లావణ్య గౌడ్, సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా , టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాసులు, జనసేన నాయకుడు అబ్దుల్లా, జయరాం, కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు..
ధర్మవరం టౌన్: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆటవిక పరిపాలన చేస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ధర్మవరం పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ ప్రదర్శన, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పురుషోత్తంగౌడ్, పరిసేసుధాకర్, కన్వీనర్ పోతుకుంటలక్ష్మన్న, పణికుమార్, మాజీ జడ్పీటీసీ మేకలరామాంజినేయులు, చిగిచెర్లరాఘవరెడ్డి, సనత్, భీమినేని ప్రసాద్‌యుడు, తదితరులు పాల్గొన్నారు.