Sep 22,2023 21:22

దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగదీశ్వరి

ప్రజాశక్తి - కురుపాం : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి సెంటర్‌ జైల్లో ఉంచారని, ఆయన ఆరోగ్యంపై అనుమానంగా ఉందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా హరిజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రికి జైల్లో ఎటువంటి సదుపాయాలు లేకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దోమల మధ్య నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఇది కేవలం వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత అరెస్టులకు నిదర్శనం అన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, టిడిపి హరిజన విభాగ నాయకులు ఎ.మహేష్‌, కె.సుందరరావు, వెంకటరమణ, గవరయ్య, గంగయ్య, ప్రశాంత్‌, అప్పారావు, పౌల్‌, ఆనంద్‌, రమేష్‌,సుందరరావు పాల్గొన్నారు.
వీరఘట్టం: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం స్థానిక ఎస్‌బిఐ ఆవరణలో టిడిపి మండల అధ్యక్షులు ఉదయాన ఉదయ భాస్కర్‌, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, జామి సింహాచలం, బల్ల హరిబాబు, మాచర్ల అనిల్‌కుమార్‌, డి.శ్రీనివాసరావు, కె.అసిరినాయుడు, తదితరులు రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. తక్షణమే బాబును విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
పార్వతీపురం రూరల్‌ : హైకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగకపోయినా సుప్రీం కోర్టులో అంతిమ విజయం సాధిస్తామని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా బాలగొడబలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమ నాయకుడి ఆరోగ్యం కోసం సింహాచలం వరకు పాదయాత్ర మొక్కులు తీర్చుకోవడానికి వెళుతున్న బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబీ నాయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వావ్యం అపహాస్యం పాలవుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచి మువ్వల పాదాల నాయుడు, భాస్కర రావు, జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట నాయుడు, కార్యదర్శి బోను చంద్రమౌళి, బార్నాల సీతారాంతో పాటుగా జనసేన నాయకులు పాల్గొన్నారు. భామిని : మండల కేంద్రంలో బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు నల్ల కండువాలు ధరించి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలనుద్దేశించి పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకష్ణ మాట్లాడుతూ చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు దీక్షలు కొనసాగించాలని, భవిష్యత్తులో వైసిపి పతనం కాయమని, టిడిపి గెలుపు తథ్యమని అన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బోగాపురపు రవినాయుడు, ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు, భూపతి ఆనందరావు, అంపిలి కేశవ, బిడ్డికి ప్రసాద్‌, జనసేన మండల అధ్యక్షులు రుంకు కిరణ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు నిమ్మక నిబ్రం, బిడ్డికి ప్రసాద్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.