Oct 17,2023 21:13

పాచిపెంటలో ప్రచారం చేస్తున్న నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి సంధ్యారాణి

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : పట్టణంలో టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం బాబు తోనే నేను అనే కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో పట్టణంలోని 5,8 వార్డుల్లో టిడిపి అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ డి శ్రీదేవితో కలిసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ చంద్రబాబుపై వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సాగిస్తున్న కక్షపూరిత చర్యలను వివరిస్తూ వారి మద్దతు కూడగట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, పోల సత్యనారాయణ, బార్నాల సీతారాం, బోను చంద్రమౌళి చంటి, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, బడే గౌరీ నాయుడు, తాతపూడి వెంకటరావు, కోలా సరిత మధుతో పాటు మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాచిపెంట : మండలంలోని కర్రివలస పంచాయతీ బొబ్బిలివలస, సీతంపేట, గైరమ్మ పేట గ్రామాల్లో మంగళవారం టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్‌బాబు, ముఖీ సూర్యనారాయణ, జి.యుగంధర్‌, కొత్తల పోలినాయుడు, రౌతు తిరుపతిరావు, దండి మోహనరావు, పల్లేడ ఉమా, చల్లా కనక, గొర్ల జగదీష్‌. జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం పిప్పలబద్రలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ గురించి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ వివరించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పల్ల రాంబాబు, అరుకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్‌, ఎస్టీ సెల్‌ అరుకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, అరుకు పార్లమెంట్‌ కొప్పలవెలమ సాధికార సమితి అధ్యక్షులు మూడడ్ల సత్యంనాయుడు, నీటి సంఘం మాజీ అధ్యక్షులు శివ్వాల నర్సింగరావు, జియ్యమ్మవలస గ్రామ సీనియర్‌ నాయకులు సోముల మాస్టరు, ఎల్‌.తాతబాబు, శిఖబడి మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌ రావు , ఎల్‌.మోహన్‌ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పిఆమిటిలో...
గుమ్మలక్ష్మీపురం : బాబు తో నేను కార్యక్రమంలో భాగంగా మండలంలోని పి.ఆమిటి పంచాయితీ కారివలస, మొరంగూడ, పి. ఆమిటి కాలనీలో కురుపాం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి తోయక జగదీశ్వరి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అరెస్ట్‌ గురించి వివరించారు. అనంతరం నిరసన చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పోలూరి శ్రీనివాసరావు, బూత్‌ కమిటీ అధ్యక్షులు తాడంగి రామారావు, యూనిట్‌ ఇంచార్జ్‌ చిన్న, వెంకటరావు పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలోని కడకెళ్లలో మంగళవారం పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఉదయాన ఉదరు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి చింత ఉమామహేశ్వరరావు, ఎన్‌.శశికుమార్‌, జి.రామకృష్ణ, యామక అప్పలనాయుడు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.