ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన దీక్షలు చేపట్టాయి. తుని చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఆదివారం కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడును తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పార్టీ శ్రేణులు సామూహిక దీక్షలు చేపట్టారు. టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. తుని, కోటనందూరు, తుని తొండంగి మండలాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన నాయకులు ప్రభుత్వ వైఖరిపై సిఎం వైఎస్.జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసేందుకు యనమల కృష్ణుడు పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా రెవెన్యూ కార్యాలయానికి బయలుదేరారు. పోలీసులు తెలుగుదేశం నేతలను అడ్డుకున్నారు. యనమల కృష్ణుడి అనుచరగణం శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు ఎన్టీఆర్ విగ్రహానికి సీనియర్ నేతలతో కలిసి కృష్ణుడు వినతిపత్రం అందించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేసి తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కృష్ణుడు పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, కరపా అప్పారావు ఇనుగంటి సత్యనారాయణ, గాడి రాజబాబు, అప్పన రమేష్, వంగలపూడి బుజ్జి, చింతంనీడి అబ్బాయి, మళ్ల గణేష్, రామచంద్ర రాజు, దంతులూరి శ్రీనివాసరాజు, మాజీ ఎంపిపి అంకంరెడ్డి నాన్న అబ్బాయి, సిద్దా రాంబాబు, పేకేటి హరిబాబు, కోడ రమణ, బోడపాటి సత్యనారాయణ, అంకంరెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాస్, చింతకాయల రవి, గాది వరహాలబాబు పాల్గొన్నారు. పెద్దాపురం చంద్రబాబును అరెస్టు చేయడం అప్రజా స్వామికమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆదివారం స్థానిక సుధా కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో సుంకర పావని, అడబాల కుమారస్వామి, ఎలిశెట్టి నాని, పేకేటి వెంకటేశ్వరరావు, మేడిది శ్రీనివాస్, చాగంటి గోపాలకృష్ణ, గుత్తుల సూర్యావతి, నంది ఉమామహేశ్వరి, రంది సత్యనారాయణ, కొరుపూరి రాజు పాల్గొన్నారు. ప్రత్తిపాడు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సత్య ప్రభ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అన్నారు. ఈ దీక్షలో వైసిపి నాయకులు కొమ్ముల కన్నబాబు, పర్వత సురేష్, జ్యోతుల పెద్దబాబు, సూతి బూరయ్య, బస ప్రసాద్, బొదిరెడ్డి గోపాలకృష్ణ, పెండ్ర శ్రీను, వైభోగుల సుబ్బారావు, బెల్లాని శ్రీను పాల్గొన్నారు. వరుపుల సత్య ప్రభ రాజా ఆధ్వర్యంలో రోడ్డుపై మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు సాయంత్రం 4 గంటల వరకూ దీక్ష కొనసాగించారు.










