Oct 18,2023 20:32

ప్రజాశక్తి - ఆచంట
        చంద్రబాబు అరెస్టుపై నిరసనగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 36వ రోజు బుధవారం కొనసాగాయి. తొలుత ఎన్‌టిఆర్‌ విగ్రహానికి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని తనయుడు పితాని వెంకట్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కేతా మీరయ్య, నాయకులు గొడవర్తి శ్రీరాములు, బలుసు శ్రీరామ్మూర్తి, నెక్క ంటి ప్రభాకర్‌, కనపాల వెంకటేశ్వరరావు, రాపాక ఆనం దరావు, ఏడిది శ్రీనివాసరావు, మానేపల్లి సత్యనారా యణ, కుసుమ వెంకటేశ్వరరావు, కుసుమే అరుణ్‌ పాల్గొన్నారు.
        పాలకొల్లు : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పాలకొల్లులో ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యం లో తెలుగు మహిళలు చేపట్టిన నిరాహారదీక్షలు బుధవారం 36వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షులు కర్నేన రోజారమణి మాట్లాడారు.
కాళ్ల : చంద్రబాబును వేధిస్తున్న సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టిడిపి గ్రామ అధ్యక్షుడు మంతెన ఆంజనేయరాజు అన్నారు. మండలంలోని ఏలూరుపాడులో బాబుతోనేను ఇంటింటికి ప్రచారం కార్యక్రమం ఆంజనేయరాజు ఆధ్వర్యంలో బుధవా రం నిర్వహించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇంటిం టికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుధాబత్తుల వంశీకృష్ణ, మంతెన    కృష్ణంరాజు, యాళ్ల చిట్టిబాబు, కొట్టి ప్రభాకరరావు, అంకాల రంగబాబు, లంకపల్లి ప్రసాద్‌, సుబ్బారావు పాల్గొన్నారు.
         మొగల్తూరు :చంద్రబాబుపై అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని ఆ పార్టీ అగ్నికుల క్షత్రి య టిడిపి నాయకులు అన్నారు. మండలంలోని ముత్యాల పల్లి గ్రామంలో టిడిపి అగ్నికుల క్షత్రియ నాయ కులు రహ దారిపై వలలతో నిరసన ప్రదర్శన చేశారు. గ్రామ ంలో ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిడి రాం బాబు, కొల్లాటి బాలకృష్ణ, బుల్లబ్బాయి, పెంటయ్య, మూలస్వామి, బంధన నాగేశ్వరరావు, విజయకుమార్‌ పాల్గొన్నారు.
         ఆకివీడు : రాజారెడ్డి రాజ్యాంగాన్ని తప్పించి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతూ టిడిపి నేతలు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. పార్టీ మండల అధ్యక్షుడు మోటిపల్లి ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
          భీమవరం రూరల్‌ : చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబుతో నేను కరపత్రాల పంపిణీ కార్యక్రమం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు అధ్యక్షతన 30వ వార్డు బలుసుముడిలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడు ఇందుకురి సుబ్రహ్మణ్యరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మామిడి ెట్టి ప్రసాద్‌, టిడిపి నాయకులు మాదాసు కనకదుర్గ, ఎండి షబీనా సయ్యద్‌, నసిమబేగం, గంధం రాధ, పామర్తి వెంకటరామయ్య, ఏసుపాదం, చెల్లబోయిన సుబ్బారావు, బొక్క సూరిబాబు, చెల్లబోయిన గోవింద్‌, మద్దుల రాము, బొక్క శ్రీనివాస్‌, జంపన ధనరాజ్‌ పాల్గొన్నారు.