Sep 28,2023 21:02

సాలూరు: నీటిలో దిగి నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- సాలూరు రూరల్‌ : దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది ఈ ప్రభుత్వం తీరు అని టిడిపి నియోజక వర్గ ఇంఛార్జి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మండలంలోని శివరాంపురంలో పార్టీ నాయకులతో కలిసి జలదీక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబును ప్రభుత్వం, జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులు చేస్తుందని కరపత్రం ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజు దేవ్‌, టిడిపి మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్‌, శ్యామ్‌, వెంకట రమణ, త్రినాథ్‌, శ్రీను, భాస్కర రావు, బాలాజీ పాల్గొన్నారు. కురుపాం: టిడిపి యువ నాయకులు వైరచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ కురుపాం టిడిపి కార్యాలయం నుండి తోటపల్లి దేవస్థానం వరకూ గురువారం సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాగా ఈ యాత్రలో టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి టి. జగదీశ్వరి తనతోపాటు తన వర్గంలో ఉన్న నాయకులు ఎవరూ పాల్గొనలేదు. మిగిలిన ఐదుగురు ఆశావాహులు కూడా పాల్గొనకపోవడంతో చర్చనీయాంశమైంది. సైకిల్‌ యాత్రకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మక జయరాజు కలిసి సంఘీభావం తెలిపారు. సైకిల్‌ యాత్ర ముగిసిన తరువాత మండల కన్వీనర్‌ కెవి కొండయ్య టిడిపి నాయకులు రిలే నిరాహరదీక్ష కొనసాగింది. సీతానగరం: మండలంలోని కాశిపేటలో గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బొబ్బిలి టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబీనాయనా, పార్వతీపురం నియోజకవర్గం ఇంఛార్జి బోనాల విజరు చంద్ర మాట్లాడుతూ చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించి రాక్షస ఆనందం పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్ష, కార్యదర్శులు కె తిరుపతిరావు, ఆర్‌. వేణుగోపాల్‌నాయుడు, ఎస్‌. హరిగోపాల్‌రావు, భాస్కరరావు, వి. సూర్యనారాయణ, రామకృష్ణ, టి. చంద్రశేఖర్‌, డి వెంకట్‌ నాయుడు, బి లక్ష్మణరావు, పిఎస్‌ఎన్‌ఎల్‌, పి సత్యనారాయణ, బర్నాల సీతారాం పాల్గొన్నారు. వీరఘట్టం : టిడిపి మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై కళ్ళకు గంతలు కట్టి మోకాళ్ళపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పి నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ ఉమామహేశ్వరరావు, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, మండల తెలుగు యువత అధ్యక్షులు మాచర్ల అనిల్‌, హరిబాబు, ఏ కుమారస్వామి, అసిరి నాయుడు, రాయిపల్లి రత్నాకర్‌, ఎన్‌ నాగభూషణ్‌, పి.ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని సంతోషపురంలో గురువారం సర్పంచ్‌ అంబటి తవిటి నాయుడు ఆధ్వర్యంలో బాబుతో నేను సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు అక్కన. మధుసూదన్‌ రావు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీతంపేట: మండలంలోని జక్కరవలస పంచాయతీ పరిధిలో దిగువ దరబా, కరగూడ గ్రామాల్లో ఎస్‌టి సెల్‌ అధ్యక్షులు బి.చంద్రరావు ఆధ్వర్యంలో గురువారం బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప్పర జమ్మిలో టిడిపి నాయకులు పడాల భూదేవి బాబు అరెస్టులో జరిగిన అన్యాయంపై అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు సవర కుంపి, సవర సూర్యారావు, కుండంగి రసూల్‌, బిడ్డిక శ్రీను, కుండంగి నాగేశ్వరరావు, ఆరిక బాలకృష్ణ, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టు సాధిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు
పాలకొండ : తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గండి రామినాయుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీపై పట్టు సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం పార్టీ పదవి దక్కించుకున్న ఆయన మండలంలో పార్టీ పటిష్టమయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మండలంలో 32 పంచాయతీల్లో కార్యకర్తలకు ఎటువంటి సమస్య ఎదురైనా తానే ముందుగా వచ్చి వారికి భరోసా ఇస్తున్నారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టిడిపి తరపున అంపిలి గ్రామ సర్పంచ్‌ స్థానానికి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అధికార పార్టీ దృష్టి అంతా ఆ పంచాయతీ మీదే పెట్టి, కీలక నేతలంతా వ్యూహం పన్నినా కూడా వైసీపీకి వారు అనుకున్నట్లుగా మెజార్టీ రాకుండా చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారనే చెప్పొచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఆయన ప్రభావం ఎంత ఉంటుందో చూడాల్సిన పరిస్థితి.