Oct 14,2023 20:58

టిడిపిలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానిస్తున్న సంధ్యారాణి

ప్రజాశక్తి - వీరఘట్టం : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని గోర గిరిజన గ్రామంలో శనివారం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మేము సైతం బాబుకు తోడుగా ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌, ఎఎంసి మాజీ చైర్మన్‌ పి.కృష్ణమూర్తి నాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షులు మాచర్ల అనిల్‌ కుమార్‌, ఎ.కుమారస్వామి, మండల కార్యదర్శి చింత ఉమామహేశ్వరరావు, ఎన్‌.శశి కుమార్‌, ఎ.కృష్ణబాబు, ఆర్‌.రత్నాకర్‌రావు, స్వామినాయుడు, డి.రాజబాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పాలకొండ : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా శనివారం ఎం.సింగుపురం, మల్లివీడు గ్రామ పంచాయతీల్లో మండల టిడిపి అధ్యక్షులు గండి రామినాయుడు ఆధ్వర్యంలో ఇంటి ఇంటికీ కరపత్రాల పంపిణీ చేశారు. ప్రతి వ్యక్తికి చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి తెలుపడమైందని, ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. చంద్రబాబుకు అన్యాయం జరిగితే ఊరుకోమని ప్రజలు గట్టిగా వ్యతిరేకం తెలుపుతున్నారు. చంద్రబాబు వెంటే మేము అంటూ ఈసారి చంద్రబాబు నాయుడును సిఎంగా గెలిపించుకుందాం అని స్వచ్చందంగా ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో కోట సంగన్నాయుడు, కిమిడి కాశీనాయుడు, శాసపు సుగుణకరరావు, మీసాల శ్రీనివాసరావు, మంకు భాస్కరరావు, మంకు రాము, కీర్తి రమణారావు, మంకు పోలినాయుడు, సామారోతు అప్పలనాయుడు, వారాడ త్రినాధ్‌నాయుడు, వారాడ దుర్గారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టిడిపిలో గిరిజన కుటుంబాలు చేరిక
మక్కువ: మండలంలోని చెప్పబుచ్చంపేట పంచాయతీ పరిధిలోని మోసూరు వలస, గుణికొండవలస, మూకవలస గిరిజన గ్రామాల నుండి పలు కుటుంబాలు శనివారం టిడిపిలో చేరాయి. టిడిపి మండల అధ్యక్షులు జి వేణుగోపాల్‌, సీనియర్‌ నాయకులు మావుడి ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి హాజరై పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై విసుగు చెందిన పలువురు టిడిపిలోకి వస్తున్నారన్నారు. అనంతరం తూరు మామిడి గ్రామంలో బాబుతో నేను కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.