ప్రజాశక్తి - కొమరాడ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ మండలంలోని టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం మండల కేంద్రంలో అరకు పార్లమెంటరీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బిడ్డిక తమ్మయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ్మయ్య మాట్లాడుతూ చంద్రబాబును ప్రభుత్వ అక్రమంగా అరెస్టు చేయడం చాలా దారుణమని అన్నారు. వైసిపి ప్రభుత్వంతో ప్రజాసమస్య వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వారు తెలిపారు. రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న టిడిపి నాయకులకు మద్దతుగా జనసేన నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ రిలే దీక్షలో మరడాన వెంకటనాయుడు, మీసాల శశిభూషణ్ రావు, కేతిరెడ్డి అచ్యుత్ రావు, రాజానురాము, జాగాన గౌరీశంకరరావు, జనసేన నాయకులు పల్లి శ్రీకాంత్, కశిణబోయిన చంటి, మరడాన రామకృష్ణ, మడక నారాయణ పాల్గొన్నారు.










