Sep 14,2023 00:29

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్ష

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్ష
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నగరి నియోజక వర్గం వడమాలపేట మండ లంలో ఆ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారికి నగరి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి గాలి భాను ప్రకాష్‌ టిడిపి నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్‌ మాట్లాడుతూ. వైసిపి ప్రభుత్వం రాక్షసాధింపుతో అక్రమ అరెస్టులు చేయడం చాలా దారుణమని దీన్ని ప్రజలు గుర్తిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సన్నాహమవుతున్నారనితెలిపారు. ఆ పార్టీ వడమాల పేట మండల పార్టీ అధ్యక్షులు జానా వెంకటయ్య, ధనుంజయ నాయుడు, చిత్తూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న, మండల నాయకురాలు హేమావతి, ఎస్‌ బి ఆర్‌ పురం సర్పంచ్‌ మణి రాజు, ఉమాపతి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
రిలే నిరాహార దీక్షచేపట్టిన టిడిపి నాయకులు