ప్రజాశక్తి- సాలూరు : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం వైసిపి ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి అన్నారు. గురువారం బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఆమె పట్టణంలోని 25వార్డులో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు అరెస్టు పై ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. జాతీయ స్థాయిలో పేరున్న గొప్ప నాయకుడిని జైల్లో పెట్టడం అనైతికమన్నారు. టిడిపికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ధి చెప్పాలని సంధ్యారాణి కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షు డు నిమ్మాది తిరుపతిరావు, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కూని శెట్టి భీమారావు, నల్ల అర్జున్ రావు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో గురువారం సాయంత్రం చంద్రబాబు అరెస్ట్ పై ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. మాజీ మంత్రి శత్రుశర్ల విజయ రామరాజు పాల్గొని మాట్లాడారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, అరుకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్, ఎస్టీ సెల్ అరుకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, నాయకులు మూడడ్ల సత్యం నాయుడు, గురాన శ్రీరామ్మూర్తి నాయుడు, లంక గోపాలం, రెడ్డి బలరాం స్వామి నాయుడు, జోగి బుజింగ రావు, కర్రి రాజేంద్ర నాయుడు, శివ్వల నరిసింగరావు, సుదర్శన్ రావు, యల్ మోహనరావు, గుంట్రెడ్డి సత్యంనాయుడు పాల్గొన్నారు.










