
కడప అర్బన్ : ఈనెల తొమ్మిదో తేదీ నంద్యాలలో తెల్లవారుజామున 3: 15 నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన పద్ధతి అప్రజాస్వామికంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పాతబస్టాండ్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కక్ష సాధింపు రాజకీయాలకు వేదికగా మారుతుందని విమర్శించారు. ఏ వ్యక్తి నైనా పోలీసులు కస్టడిలోకి తీసుకునేటప్పుడు రిమాండ్ రిపోర్టు, ఎఫ్‌ఐఆర్ కాపీలు ముద్దాయిగా ఆరోపణ
ఎదుర్కొనే వారికి ఇవ్వాలని తెలిపారు. 24 గంటలు ఆలస్యంగా ఇచ్చినట్లు పత్రికల్లో వచ్చాయని, ఇది సిఆర్‌పిసి ప్రొసీడింగ్స్‌కు భిన్నమైందన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ చర్యలకు దారితీస్తుందని తెలిపారు. 2016 - 17 లో స్కిల్ డెవలప్మెంట్ అవినీతిపై, 2021లో ఎఫ్‌ఐఆర్ సిఐడి ఫైల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడుని ఎందుకు అక్యుజుడ్‌గా చూపించలేదని, దానివల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, రాజకీయ కక్ష సాధింపుగా ఈ అరెస్టును చూడాల్సి వస్తుందని చెప్పారు. అవినీతికి ఎవరు పాల్పడ్డా నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో బిజెపి సిబిఐను, రాష్ట్రంలో వైసిపి సిఐడిని వాడుకుని ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యలని పేర్కొన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.రామమోహన్, బి.మనోహర్ పాల్గొన్నారు. దుర్కొనే వారికి ఇవ్వా లని తెలిపారు. 24 గంటలు ఆలస్యంగా ఇచ్చినట్లు పత్రికల్లో వచ్చాయని, ఇది సిఆర్‌పిసి ప్రొసీడింగ్స్‌కు భిన్నమైందన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ చర్యలకు దారితీస్తుందని తెలిపారు. 2016 - 17 లో స్కిల్ డెవలప్మెంట్ అవినీతిపై, 2021లో ఎఫ్‌ఐఆర్ సిఐడి ఫైల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడుని ఎందుకు అక్యుజుడ్‌గా చూపించలేదని, దానివల్ల అనుమానాలు వ్యక్తమ వుతున్నాయని, రాజకీయ కక్ష సాధింపుగా ఈ అరెస్టును చూడాల్సి వస్తుందని చెప్పారు. అవినీతికి ఎవరు పాల్పడ్డా నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో బిజెపి సిబిఐను, రాష్ట్రంలో వైసిపి సిఐడిని వాడుకుని ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యలని పేర్కొన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.రామమోహన్, బి.మనోహర్ పాల్గొన్నారు.