ప్రజాశక్తి - గుమ్మ లక్ష్మీపురం : టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయడం వైసిపి దుర్మార్గపు చర్యకు నిదర్శనమని టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జియమ్మ వలస మండల కేంద్రంలో టిడిపి మండల కన్వీనర్ పల్లా రాంబాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఆదివారం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న శత్రుచర్ల మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా చంద్రబాబు జైలు నుంచి తిరిగి వస్తారని అన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి కురుపాం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. కార్యక్రమంలో అనంతరం గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కష్ణబాబు, అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, టిడిపి కురుపాం నియోజకవర్గ నాయకులు వైరిచర్ల వీరేష్‌దేవ్, ఎంపిపి బొంగు సురేష్, కురుపాం నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు గురనా శ్రీరామ్మూర్తి, గుమ్మలక్ష్మీపురం మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, జనసేన గుమ్మలక్ష్మీపురం మండల అధ్యక్షులు కడ్రక మల్లేశ్వరరావు, జియమ్మ వలస మండల కన్వీనర్ వారణాసి శివ, కార్యదర్శి తాడేల శ్రీరామ్, టిడిపి నాయకులు, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీతంపేట: మండలంలో పాలకొండ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు బిడ్డిక దమయంతి నాయుడు ఆధ్వర్యంలో ఆమె ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బాబుని అక్రమ అరెస్టులు అన్యాయమన్నారు. 2024 ఎన్నికల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు బి.జయలక్ష్మి, కార్యకర్తలు కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.
అర గుండు గీయించుకున్న గిరిజన నాయకుడు
సాలూరు: మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పట్టణంలో టిడిపి ఆధ్వర్యాన దీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగు యువత ఆధ్వర్యాన దీక్షలను వేణుగోపాల స్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఆదివారం నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును వైసిపి ప్రభుత్వం అక్రమం గా అరెస్టు చేసిందని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీక్ష శిబిరం లో పాల్గొన్న గిరిజన నాయకుడు చోడిపిల్లి మాలతీదొర చంద్రబాబు నాయుడు అరెస్టు కి నిరసనగా అరగుండు గీయించుకున్నారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఆముదాల పరమేష్, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కౌన్సిలర్ వి.హర్షవర్ధన్ పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్ : చంద్రబాబు అరెస్టును నిర్వహిస్తూ నియోజకవర్గ ఆధ్వర్యంలో చర్చి, మసీదుల్లోనూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వాన్ని నిలువరించేందుకు టిడిపితో జనసేన కలిసి రావడాని తాము స్వాగతిస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్తు దష్ట్యా ప్రజాస్వామ్యక వాదులందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట నాయుడు మాజీ ఏఎంసీ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు బడే గౌరీ నాయుడు టి వెంకటరావు కోలా సరిత మధుసూదన్ రావు నాయకులు బార్నాల సీతారామారావు బోను చంద్రమౌళి గురజాన చంద్రమౌళి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వీరఘట్టం : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక ఆర్‌సిఎం చర్చిలో ప్రార్ధనలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, మండల అధ్యక్షులు ఉదయాన ఉదరు భాస్కర్, ఎఎంసి మాజీ చైర్మన్ పొదిలపు కష్ణమూర్తి నాయుడు, పాలకొండ మండల అధ్యక్షులు గండి రామినాయుడు, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, బల్ల హరిబాబు, తెలుగు యువత నాయకులు మాచర్ల అనిల్, భౌరోతు నీలకంఠం నాయుడు, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షులు వెలగాడ శ్రీను , తూముల రమేష్ , రాయి పిల్లి రత్నాకర్ తదితరలు పాల్గొన్నారు.










