ప్రజశక్తి - చీరాల
చంద్రబాబును అన్యాయంగా జగన్మోహన్రెడ్డి అరెస్టుచేయించి జైలుకు పంపారని టిడిపి ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. ఒంగోలులో జరిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి విస్తృతస్థాయి సమావేశానికి చీరాల నుంచి కొండయ్య ఆధ్వర్యంలో టిడిపి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ఓడిపోవటం ఖాయమని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చలేకుండా ప్రజలకు సేవలందించాడని అన్నారు. ప్రజలు చంద్రబాబుకు అండగా ఉండాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.










