Sep 09,2023 21:07

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఎన్టీఆర్‌ విగ్రహం ముందు ధర్నా చేస్తున్న టీడీపి నాయకులు కార్యకర్తలు


చంద్రబాబు అరెస్ట్‌పై నేతల నిరసనాగ్రహం
- జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో రాస్తారోకోలు, ధర్నాలు
- అర్థరాత్రి నుండి టిడిపి నేతల నిర్భందం
- పోలీస్‌ స్టేషన్‌లకు తరలింపు.. విడుదల
ప్రజాశక్తి - విలేకరులు

      మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్టు అనంతరం అర్థరాత్రి నుండి మాజీ మంత్రి భూమా అఖిలప్రియను, మాజీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, బిసి జనార్దన్‌ రెడ్డి, బిసిజయ నాగేశ్వర రెడ్డి, భూమా బ్రహ్మనంద రెడ్డి, బిటి నాయుడులను, ఉమ్మడి కర్నూలు జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలను బండి ఆత్మకూరు, మహానంది పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు. శనివారం ఉదయం వారిని విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా టిడిపి నేతలు నల్ల బ్యాడ్జీలతో రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
నంద్యాల కలెక్టరేట్‌ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అన్యాయం, అక్రమమని నంద్యాల ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శనివారం నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆయన ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం టిడిపికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని సిఎం జగన్‌ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నాయకులపై దాడులు చేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. దొంగల్లా వచ్చి పోలీసులు అరెస్ట్‌ చేయడం ఏమిటని నిలదీశారు. పోలీసులు, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నారని, రానున్న రోజుల్లో వాళ్లు తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును గెలిపించు కోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్‌, అనుబంధ సంఘాల నాయకులు , కౌన్సిలర్‌, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాదరణ చూసి ఓర్వలేకే అక్రమ కేసులు : చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి ఫరూక్‌, టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ ఆరోపించారు. నంద్యాల పట్టణంలోని ఖలీల్‌ టాకీస్‌ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నంద్యాలలో బాబు సభ సక్సెస్‌ అయిందని, దీన్ని చూసి ఓర్వలేకనే చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారన్నారు. ఇప్పటికైనా ప్రజలు, మేధావులు ఆలోచించి జగన్‌ లాంటి వ్యక్తికి ఓట్లు వేయకూడదని, బాబు లాంటి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్‌, నాయకులు పాల్గొన్నారు.
బనగానపల్లె : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్ల కండువాలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ నాయకులు బీసీ రామనాథ్‌ రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ నాయక్‌, జిల్లా అధ్యక్షులు కృష్ణా నాయక్‌,బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దరాజుపాలెం భూషన్న, పట్టణ ఉపసర్పంచి బురానుద్దీన్‌, పట్టణ అధ్యక్షులు ఖాసింబాబు, మండల కార్యదర్శి ఖాదర్‌ బాషా, మైనార్టీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు రాయలసీమ సలాం, నాయకులు అన్వర్‌ సాహెబ్‌, అల్తాఫ్త్‌ హుస్సేన్‌ , టిప్‌ టాప్‌ కలాం, జెడ్‌ కృష్ణారెడ్డి, లాయర్‌ నాగేంద్ర రెడ్డి, షేక్షావలి, యాగంటి పల్లె తపాల పెద్ద దస్తగిరి, పసుపుల కామేష్‌, చిన్న రాజుపాలెం నరసింహ, రామాంజనేయులు, వెంకటాపురం గడ్డం చిన్నారెడ్డి పాల్గొన్నారు. కోవెలకుంట్ల : చంద్రబాబు నాయుడు అరెస్టు అమానవీయ చర్య అని తెలుగు రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకష్ణారెడ్డి పేర్కొన్నారు. కోవెలకుంట్ల పట్టణంలో రాస్తారోకోను నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గడ్డం నాగేశ్వర్రెడ్డి, పట్టణ టైలర్‌ అసోసియేషన్‌ సభ్యులు, సాహెబ్‌ భాష, సాదిక్‌, యాదవ్‌ కుమార్‌, బిజినవేముల రాధాకృష్ణమూర్తి, షరీఫ్‌, రామకృష్ణ, నరసింహమూర్తి, వడ్డే శ్రీనివాసులు, లాయర్‌ రమేష్‌ చౌదరిలు పాల్గొన్నారు.
అర్ధరాత్రి నుండే టిడిపి ఇన్‌చార్జీలు నిర్బంధం
బండి ఆత్మకూర్‌: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టు అనంతరం అర్థరాత్రి నుండి ఉమ్మడి కర్నూలు జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలను, ముఖ్య నేతలైన బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, బీసీ జనార్దన్‌ రెడ్డి, బీవీ జయ నాగేశ్వర రెడ్డి, భూమా బ్రహ్మనంద రెడ్డి, బిటి నాయుడు, డోన్‌ ఇంఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిలను బండి ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు. పోలీస్‌ స్టేషన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ మాజీ ప్రజాప్రతినిధులైన తమకు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్ల కిందనే కూర్చోబెట్టి నిరంకుశంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వైసిపి పాలన బ్రిటిష్‌ పాలనను తలపిస్తోందన్నారు. అనంతరం విడుదలైన వారు టిడిపి మండల ఇన్చార్జి నందిపాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు బస్టాండ్‌ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ నిరసనలో టిడిపి నాయకులు కంచర్ల సురేష్‌ రెడ్డి, బొల్లవరం మల్లేశ్వర రెడ్డి,బైరెడ్డి సుబ్బారెడ్డి,మనోహర్‌ చౌదరి,వెంకటాపురం శ్రీనివాసులు, ఇతర టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ/మహానంది : మాజీ మంత్రి భూమా అఖిలప్రియను శనివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకొని మహానంది పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అలాగే టిడిపి యువ నాయకులు భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, భార్గవ రామ్‌లను బండి ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.. మరోవైపు నంద్యాల పార్లమెంటు అధికార ప్రతినిధి రాము యాదవ్‌, భూమా సందీప్‌ రెడ్డి, గుంప్రమానుదిన్నె నాయకులు మోహన్‌ రెడ్డి లను పోలీసులు గహ నిర్బంధంలో ఉంచారు.
చంద్రబాబు అరెస్టు అక్రమం : మాజీ మంత్రి అఖిలప్రియ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అక్రమం, అన్యాయమని మాజీ మంత్రి అఖిలప్రియ విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయన్నారు. చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో వైకాపా దిగజారుడు రాజకీయాలకు ఉదాహరణ అన్నారు. ఎన్‌ఎస్‌జి రక్షణ ఉన్న నాయకుడిని కేంద్రం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. వైసిపి అక్రమాలపై రాష్ట్ర ప్రజలందరూ తిరగబడతారన్నారు.
రాష్ట్రం అగ్ని గుండంగా మారింది : ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
డోన్‌: వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం అంతా అగ్ని గుండంగా మారిం దని డోన్‌ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ డోన్‌ పట్టణంలో డోన్‌ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, డోన్‌ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర, శ్రీనివాసులు యాదవ్‌ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ధర్మవరం సుబ్బారెడ్డి వారితో మాట్లాడి బయటకు తీసుకొచ్చారు. కార్యక్రమంలో బిసి సెల్‌ జిల్లా అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్తా మల్లిఖార్జున, పట్టణ అధ్యక్షులు చక్రపాణి గౌడ్‌, సీనియర్‌ నాయకులు టి.ఈ.వెంకటనారాయణ గౌడ్‌,అడ్వకేట్‌ ఆలా మల్లిఖార్జున రెడ్డి, అడ్వకేట్‌ హారుణ్‌, అడ్వకేట్‌ మధుసూదన్‌ గౌడ్‌,అడ్వకేట్‌ క్రిష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. పాములపాడు: పాములపాడు మండల నాయకులు ప్రధాన రహదారిపై సిఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం టిడిపి మండల నాయకులు గోవిందు, చంద్ర శేఖర్‌, తెలుగు యువత అధ్యక్షులు మధు కృష్ణ మాట్లాడారు. నాయకులు ఎన్‌ కృష్ణయ్య,సాములు, లింగాల సర్పంచ్‌ బాల మల్లేశ్వర్‌ రెడ్డి, ఉస్మాన్‌ బాష, నాగలక్ష్మి రెడ్డి, లింగస్వామి, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు : పట్టణంలోని టిడిపి పార్లమెంట్‌ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో పటేల్‌ సెంటర్‌లోకార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీ ఇన్చార్జ్‌ జయ సూర్య,వెంకటేశ్వర్లు యాదవ్‌, సంపత్‌ కుమార్‌ యాదవ్‌, అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్యాపిలి : టిడిపి నాయకులు అంకిరెడ్డి, వెంకటేస్వరరెడ్డి, రామసుబ్బయ్య, రాంమోహన్‌, చిన్న సుంకయ్యల ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఆవరణలో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. చాగలమర్రి : టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్‌బాష ఆధ్వరంలో స్థానిక టిడిపి కార్యాలయం నుంచి గాంధీ సెంటర్‌ వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీని నిర్వహించారు.టిడిపి నాయకులు కొలిమి హుసేన్‌వళి, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి గుత్తి నర్సింహులు, బిసి సెల్‌ స్పోక్‌ పర్సన్‌ సల్లానాగరాజు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ ముల్లా ఆజిముద్దీన్‌, పట్టణ ఉపాధ్యక్షుడు ముల్లా షాబులు, ప్రచార కార్యదర్శి ముల్లాగాఫార్‌, ప్రధాన కార్యదర్శి ఆలంసా గారి హనీఫ్‌, తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు : సున్నిపెంటలోని అంబెడ్కర్‌ సెంటర్‌లో టిడిపి నాయకులు నిరసనను తెలియజేశారు. నాయకులు జంకె రామ సుబ్బారెడ్డి, ఆడుసుమల్లి సుబ్బారావు రూపస్‌, సురేష్‌, ఉమా, పలనీ స్వామి, మల్లేష్‌, చిన్నబాబు,పీరా, రమణ పాల్గొన్నారు. బేతంచర్ల : టిడిపి మండల కన్వీనర్‌ ఉన్నం ఎల్ల నాగయ్య, మాజీ జెడ్పిటిసి, బుగ్గన ప్రసన్న లక్ష్మిల బేతంచెర్ల పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. టిడిపి పార్లమెంటు ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వర్‌ రెడ్డి, డోను నియోజకవర్గం సలహాదారులు చౌదరి, తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌: ఆత్మకూరు పట్టణంలో బస్టాండ్‌ ఎదురుగా కెజి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఉదయం నుండి ఆర్టిసి బస్సులను నిలిపివేశారు. దీంతో ఉపాధ్యాయులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు టిడిపి శ్రేణులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.