ప్రజాశక్తి - కురుపాం : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా స్థానిక టిడిపి కార్యాలయం వద్ద టిడిపి గిరిజన విభాగం సభ్యులు గురువారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు అన్ని వర్గాల ప్రజల నుంచి వైసిపి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నా అయినప్పటికీ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు కెవి కొండయ్య, పాడి సుధా, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్, అరుకు పార్లమెంట్ ఎస్‌టి సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, క్లస్టర్ ఇన్‌ఛార్జి వెంకటరావు, ఎస్‌టి సెల్ సభ్యులు తాడంగి రామారావు, మాసయ్య ,టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరఘట్టం : స్థానిక స్టేట్ బ్యాంకు వద్ద పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో వీరఘట్టం, పాలకొండ మండలాల అధ్యక్షులు ఉదయాన ఉదరు భాస్కర్, గండి రామినాయుడు, రాష్ట్ర కార్యదర్శి కర్నేని అప్పలనాయుడు, ఎఎంసి మాజీ చైర్మన్ పి.కృష్ణమూర్తినాయుడు, బల్ల హరిబాబు, మాచర్ల అనిల్‌కుమార్, పి.వెంకటరమణ, ఎఎంసి మాజీ ఉపాధ్యక్షులు వెలగాడ శ్రీనివాసరావు, ఎన్.శశికుమార్, సిహెచ్ ఉమామహేశ్వరరావు, తాతబాబు, తూముల రమేష్, రాయిపల్లి రత్నాకర్, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నారు. సాలూరురూరల్ : మండలంలోని మామిడిపల్లిలో డొంక రాము విగ్రహం వద్ద గిరిజన నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి జి.సంధ్యారాణి ఆధ్వర్యాన జరిగిన దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్, పట్టణ అధ్యక్షులు నిమ్మాది చిట్టి, మక్కువ నాయకులు గుల్ల వేణు, పెంట తిరుపతి రావు, పాచిపెంట నాయకులు పిన్నింటి ప్రసాదు, పోలి నాయుడు, మెంటాడ మండల నాయకులు చలుమురి వెంకటరావు, సాలూరు మండల టిడిపి అధ్యక్షుడు ఆముదాల పరమేష్, బూస తవుడు, తాడుతూరి చినబాబు, బూస తిరుపతి రావు, బుజ్జి, రామారావు, అప్పికొండ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : మండలంలోని నర్సిపురంలో మాజీ సిఎం చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ప్రకాష్, గొట్టాపు వెంకటరమణ, గొట్టాపు గౌరితో పాటుగా మహిళా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. భామిని : మండల టిడిపి అధ్యక్షులు బోగాపురపు రవినాయుడు, ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం టిడిపి రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. సభ్యులు నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బిడ్డికి ప్రసాద్‌రావు, భూపతి ఆనందరావు, లోపింటి రాజేష్, కోరాడ రాజేష్, కృష్ణ చంద్ర దొర, అంపిలి కేశవ, జిల్లెడి రవి తదితరులు పాల్గొన్నారు. ం










