Oct 12,2023 21:24

నగరంలో పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి

           ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ చంద్రబాబు అక్రమ కస్టడీని ప్రజలంతా ఖండించాలని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని 1వ డివిజన్‌ ఎర్రనేల కొట్టాలలో బాబు అక్రమ అరెస్టు అంశాన్ని ఇంటింటికీ వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వయసును కూడా చూడకుండా , రుజువులు సాక్షాలు లేకపోయినా అక్రమంగా నిర్బంధించారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జెఎన్‌టియుతోపాటు నగరంలోని రెండు స్కిల్‌ డెవలప్మెంట్‌ కేంద్రాలను పరిశీలించానని, అక్కడ వేల మంది విద్యార్థులకు శిక్షణ అందించారని, ప్రభుత్వ రాష్ట్రంలోని 42 కేంద్రాలను ప్రాథమికంగా పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయన్నారు. అన్నా క్యాంటీన్లలో, పెన్షన్లలో, డ్రిప్‌ సబ్సిడీల్లో కూడా అవినీతి ఉందేమో అంటారని వ్యంగంగా విమర్శించారు. ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఎందుకు ఓటేశామని బాధపడుతున్నారన్నారు. తమకు పైస్థాయిలో న్యాయం జరగనప్పుడు, ప్రజలలోకి వెళ్తున్నామన్నారు. ప్రజల నుంచి స్పందన లభిస్తోందని, చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి బాధపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలారి ఆదినారాయణ,దేవల్ల మురళి,ముక్తియార్‌, అజీజ్‌, సరిపూటి రమణ, చంద్రమౌళి, ఖాదర్‌ వలి, బంగి నాగ, మారుతీకుమార్‌గౌడ్‌, వెంకటేష్‌, రాజారావు, నారాయణస్వామి యాదవ్‌, సుధాకర్‌ యాదవ్‌, బొమ్మినేని శివ, కడియాల కొండన్న, మల్లికార్జున, ,గుర్రం నాగభూషణ, ముబారక్‌, రఫిక్‌ అహ్మద్‌, గోపాల్‌ గౌడ్‌, బోయపాటి బాలప్ప, రాయల్‌ రఘు, జేయం భాష, పోతుల లక్ష్మీనరసింహులు, వన్నూర్‌, బోయ మూర్తి, కనుమచౌడయ్య, గంగవరం అంజి, తెలుగు మహిళలు విజరు శ్రీరెడ్డి, తేజస్విని, సరళ, జానకి, వెంకటలక్ష్మి, వరలక్ష్మి, బుజ్జమ్మ, హసీనా, షరీనా, కష్ణవేణి, వసుంధర, తదితరులు పాల్గొన్నారు.