Sep 14,2023 00:34

ప్రజాశక్తి - అద్దంకి
టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు స్థానిక రామాటాకీస్ స్థలంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. జగన్‌ రాక్షస పాలనకు ప్రజలు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని టిడిపి నాయకులు అన్నారు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతిపక్షంపై కక్షసాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ పొంది అనేకమంది యువకులు ఉద్యోగాలు పొందారని అన్నారు. ఆధారాలు చూపమంటే ప్రభుత్వం పారిపోతుందని అన్నారు. పిర్యాదే లేని కేసులో చంద్రబాబును జైలుకు పంపారని అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు, ఇంచార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.