బంద్ ప్రశాంతం
ప్రజాశక్తి - చాట్రాయి
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మండలంలోని టిడిపి నాయకులు సోమవారం బంద్ నిర్వహించారు. రాష్ట్ర టిడిపి ఇచ్చిన బంద్ నేపథ్యంలో చనుబండలో ఇండియన్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, స్కూల్‌లను మండల కేంద్రమైన చాట్రాయిలో ఏలూరు పార్లమెంటు అధికార ప్రతినిధి మందపాటి బసవరెడ్డి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు టిడిపి నాయకులతో కలిసి దుకాణాలు, బ్యాంకులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను బంద్‌లో భాగంగా మూయించేశారు. ఈ బంద్ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, కంచర్ల హనుమంతరావు, కొండలరావు, పుల్లారావు, కంపసాటి చెన్నారావు, పుచ్చకాయల నోబుల్ రెడ్డి, బొట్టు రామచందర్రావు, పలగాని దుర్గారావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










