Sep 09,2023 16:33

ప్రజాశక్తి - చింతలపూడి
    టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చింతలపూడి నియోజకవర్గ మాజీ మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ జగ్గవరపు ముత్తారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం నుంచి నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు పట్టుకోని నిరసన ర్యాలీ స్థానిక ఎన్‌టిఆర్‌ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో యాళ్ల లీలా ప్రశాంతి, బొమ్మాజి అనిల్‌, సొంగా రోషన్‌ కుమార్‌, మాటూరు వెంకట్రామయ్య, కొండ్రు దేవా, పక్కాల వెంకటేశ్వరరావు, బోడ నాగభూషణం, బోడా అనిష్‌ కుమార్‌ పాల్గొన్నారు.