Sep 28,2023 23:20

ప్రజాశక్తి - అద్దంకి
టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పట్టణంలోని రామా టాకీస్ సెంటర్ వద్ద 16వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. జె పంగులూరు టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ కుక్కపల్లి ఏడుకొండలు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు వలపర్ల సుబ్బారావు, బాపట్ల పార్లమెంట్ తెలుగు రైతు ఉపాధ్యక్షులు కర్రీ సుబ్బారావు, బెల్లంకొండ దశరథ, కుక్కపల్లి పద్మ, చింతల విజయలక్ష్మి, దాసరి హనుమాయమ్మ, రావూరి సుభాషిని, తలపనేని వీరమ్మ, తలపనేని సీతా దీక్షలో కూర్చున్నారు. వీరికి గుర్రం శేఖర్, దాసరి హనుమంతరావు, వలపర్ల సుబ్బారావులు నల్ల కండవాలు వేసి దీక్ష ప్రారంభించారు. దీక్షా శిబిరంను ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు. నందమూరి కళాపరిషత్  అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షత వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 85వేల మందికిపైగా ఉపాధి పొందారని అన్నారు. ఒక తప్పుడు కేసును పెట్టి కవర్ చేసుకోవటానికి మరో తప్పుడు కేసు పురమాయిస్తున్నారని అన్నారు. చంద్రబాబుతోపాటు లోకేష్ మీద కూడా ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయని ఏ14గా లోకేష్ బాబును చేర్చారని అన్నారు. ఫైబర్ నెట్‌లో కూడా అవుతావుకల జరిగినాయని కేసులు మోపుతున్నారని అన్నారు. అక్రమ కేసులు పెడుతున్న తీరు వైసిపి దిగజారుడు తనానికి నిరదర్శనమని అన్నారు. వైసిపి అరాచకాలు చూడలేక వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, సర్పంచులు దాదాపు రెండు వేలమందికిపైగా గిద్దలూరులో టిడిపిలో చేరారని అన్నారు. నాలుగేళ్లుగా ఏమీ చేయలేక చంద్రబాబు, లోకేష్ పాదయాత్రలకు వచ్చే ప్రజాదారణ చూడలేక, ఓటమి భయంతో కేసులు పెట్టి అరెస్టు చేశారని అన్నారు. పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే కూడా రాజమండ్రి చంద్రబాబుకి పోస్ట్ కార్డు రాసి పోస్ట్ చేశారు. కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ, చిన్ని శ్రీనివాసరావు, బచ్చల వాసు, ఎర్రాకుల రామాంజనేయులు, చేబ్రోలు వెంకటసుబ్బయ్య, సంధిరెడ్డి శ్రీనివాసరావు, కుందారపు రామారావు, వడ్డవల్లి పూర్ణ, కాకాని అశోక్, కందిమల్ల రామాంజనేయులు, చుండూరు మురళి, ఎస్‌కె మహబూబ్, ఎస్‌కె మొహిద్దిన్, ఎస్‌కె మదీనా, ఎడవల్లి అశోక్, స్వామి శ్రీను పాల్గొన్నారు.