చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఖండన
ప్రజాశక్తి-కావలి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమఅరెస్టును ఖండిస్తున్నామని ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌పి నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదివారం కావలి టౌన్‌లోని జర్నలిస్టుక్లబ్‌లో విలేకరుల సమావేశం, ఎంఎస్‌పి నియోజక వర్గ కన్వీనర్ అక్కిలగుంట ఏసు మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌పి జిల్లా ఇన్‌ఛార్జి సూరిపాక వాసు దేవరావు మాదిగ పాలకులు ఎవరైనా కక్షపూరిత అప్రజాస్వామిక, నియంతృత్వ వైఖరిలను విడనాడి, రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి పని చేయాలన్నారు. నాడు దళతుడైన డాక్టర్ సుధాకర్‌పై వ్యవహరించిన తీరు, నేడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు వరకు చూస్తే రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందన్నారు. దీన్ని ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌పి తీవ్రంగా ఖండిస్తున్నామని ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఎస్‌పి జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్‌పి జిల్లా కోకన్వీనర్ కోళ్లగట్ల రమేష్ మాదిగ, ఎంఎస్‌పి సీనియర్ నాయకులు గోచిపాతల వేంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్‌పి మహిళా ఇన్‌ఛార్జి గేరా జానకి మాల, ఎంఆర్‌పిఎస్ మండల కన్వీనర్ బి.మనోహర్, టౌన్ అధ్యక్షులు మంద మహేష్, తదితరులు పాల్గొన్నారు.










