ప్రజాశక్తి - అద్దంకి
ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురు టిడిపి నిరాహార దీక్ష శిబిరం బుధవారం ప్రారంభించారు. దీక్ష శిబిరాన్ని నందమూరి కళాపరిషత్ అధ్యక్షులు మనం త్రిమూర్తులు, నర్రా గోపాలరావు, మల్లాది శ్రీనివాసరావు, లహరి ప్రారంభించారు. టిడిపి బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ ధర్మవరపు నాగేశ్వరరావు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టును ఖండించారు. కక్షపూరితంగా కేసులు పెట్టారని అన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. విచారణలో న్యాయం గెలుస్తుందని అన్నారు. దీక్షల్లో నాగినేని రామకృష్ణ, సంధిరెడ్డి శ్రీనివాసరావు, గోరంట్ల లక్ష్మణదాస్, చిన్ని శ్రీనివాసరావు, కుందారపు రామారావు, గోగులమూడి రాజశేఖర్, మాగులూరు గోపికృష్ణ, పి గోపికృష్ణ, బి రామాంజనేయులు, బి నాగరాజు, పి రామాంజనేయులు, ఎస్‌కె మదీనా, నర్రా రవీంద్రనాథ్, ఎస్‌కె రహీం కూర్చున్నారు. కార్యక్రమంలో వి పూర్ణ, కాకాని అశోక్, నర్రా గోపాల్, చండూరు మురళి, మల్లాది శ్రీనివాసరావు, పరిటాల పవన్ కుమార్, అంగలకుర్తి హనుమయ్య, పొన్నలూరు కిరణ్ కుమార్, వేముల నాగేశ్వరరావు పాల్గొన్నారు.










