Jul 10,2023 00:18
పతకాలు అందిస్తున్న రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: ఛందోలు గ్రామానికి చెందిన సయ్యద్‌ ఫిసల్‌ నియాజ్‌ (గన్‌ పంతులు మనుమడు) అనే యువకుడు షూటింగ్‌ విభాగంలో పతకాలు సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 23వ ఛాంపియన్‌షిప్‌ విజయ వాడలో లేమన్‌ ట్రీ ప్రీమియర్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మీటర్ల షూటింగ్‌లో కాంస్య పతకం, 25 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించాడు. ఈ పతకాలు రావటంతో ఛందోలు గ్రామ కీర్తి ఉన్నత స్థానంలో నిలిచిందని పలువురు ప్రముఖులు సయ్యద్‌ ఫిసల్‌ నియాజ్‌కు అభినందన లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో జన్మించి ఎందరికో ఆద ర్శంగా నిలిచిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి క్రీడలలో రాణిం చి తన గ్రామానికి మంచి పేరు తెచ్చాడని గ్రామస్తులు సంతో షం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో సంబరాల వాతావరణం నెలకొంది. పతకాలను ఫిసల్‌ నియాజ్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సలైత్‌ చేతుల మీదుగా అందుకున్నాడు.