Jan 04,2023 11:17

ప్రజాశక్తి-పాడేరు : అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఏ ముట్టడి కార్యక్రమాన్ని ఆశావర్కర్లు సిహెచ్ డబ్ల్యూలు జయప్రదం చేయాలని సిఐటియు అల్లూరి జిల్లా సహకార దర్శి గడుతూరి సత్యనారాయణకు పిలుపునిచ్చారు. ఈ సందర్భం గా గడుతూరి సత్యనారాయణమాట్లాడుతూ ఆశ వర్కర్లు సిహెచ్ డబ్ల్యు లు గత 20 సంవత్సరాల పైబడి నుండి గిరిజన గ్రామాల్లో గూడేళ్లు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, తదితర డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 12వ తేదీన పాడేరు ఐటిడి ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సన్నిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జరపదం చేయాలని ఆశ వర్కర్లు సిహెచ్ డబ్ల్యు జయప్రదం చేయాలని అల్లూరు జిల్లా సిఐటియు పిలుపునిచ్చింది.