Aug 02,2021 09:14

కాలిఫోర్నియా : ఉత్తర కాలిఫోర్నియాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ మారుమూల ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి నలుగురు మృతి చెందారు. ది రాబిన్‌సన్‌ ఆర్‌ 66 అనే హెలికాప్టర్‌ ఆదివారం మధ్యాహ్నం 1.15 సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలినట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించినట్లు కెఎస్‌టివి స్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ధ్రువీకరించింది. ప్రాథమిక సమాచారం మేరకు నలుగురు వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోందని, మఅతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎఫ్‌ఎఎ, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డులు ప్రకటించాయి.