
సీతానగరం: ఈనెల 15న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చలో విజయవాడ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం రక్షణ బస్సు యాత్రలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ప్రజలపై దాడులు పెరిగాయని, ఈ అసమానతలు పోవాలని అన్నారు. ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రజలంతా కలిసి రావాలని కోరుతూ జరగనున్న బహిరంగసభలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని, కావున ప్రజలంతా ఈ బహిరంగసభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.వెంకటరవణ, ఎం.సింహాచలం, రాధ, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ: అసమానతలు లేని రాష్ట్రం జిల్లా అభివద్ధి కోసం ఈనెల 15న విజయవాడలో జరిగే సిపిఎం ప్రజారక్షణభేరి ముగింపు బహిరంగ సభ కు భారీగా ప్రజలు కదిలి రావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు బహిరంగ సభకు సంబంధించిన గోడ పోస్టర్లు కొమరాడలో విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉపేంద్ర, లక్ష్యం నాయుడు, రామారావు, రైతులు పాల్గొన్నారు.
పాలకొండ: అసమాన తల్లేని రాష్ట్ర అభివృద్ధి కోసం సిపిఎం తలపెట్టిన ప్రజారక్షణ భేరి ముగింపు సభ ఈ నెల 15 న విజయవాడలో జరుగనుంది అని, ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం మండల కమిటీ కన్వీనర్ దావాల రమణారావు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్లను పాలకొండలో ఆవిష్కరించారు. కరెంట్ యూనిట్‌కు ఒక రూపాయి, గ్యాస్ నాలుగు వందల రూపాయలకు, అరవై రూపాయలకే డీజిల్, పెట్రోలు తదితర ప్రజలకు అవసరమైన అంశాలపై ఈ ముగింపు సభలో చర్చించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.రాము, డి.పట్టాభి, సంజీవి, వేణు, దుర్గారావు, వీరయ్య, వాసు తదితరులు ఉన్నారు.