ప్రచార జాతాను నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులు
ప్రజాశక్తి - గోనెగండ్ల
గతేడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఈనెల 30న విజయవాడలో జరిగే నిరసనను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం మండల నాయకులు నరసింహులు కోరారు. బుధవారం గోనెగండ్లలో 'చలో విజయవాడ'ను జయప్రదం చేయాలని కోరుతూ జాతా నిర్వహించి, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వారికి ఎలాంటి నష్టపరిహారమూ, ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదన్నారు. ప్రభుత్వం వారికి పంట నష్టపరిహారం అందజేసే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.










