Nov 11,2023 19:52

బొబ్బిలిలో ఆటో ప్రచారం చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, నాయకులు

ప్రజాశక్తి-బొబ్బిలి, తెర్లాం :  ఈ నెల 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు కోరారు. ప్రజా రక్షణభేరి సభను జయప్రదం చేయాలని బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రపురం మండలాల్లో ఆటో ప్రచారం చేశారు. కార్యక్రమంలో సిపిఎం బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం మండలాల కార్యదర్శులు ఎస్‌.గోపాలం, సురేష్‌, బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

  విజయనగరంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు
విజయనగరంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు


విజయనగరం టౌన్‌ : ప్రజా రక్షణ భేరిలో భాగంగా ఈ నెల 15న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్రావు, నగర కమిటీ సభ్యులు వి.లక్ష్మి కోరారు. శనివారం నగరంలోని వైఎసఆర్‌ కాలనీలో ఇంటింటికి సిపిఎం ప్రజాప్రణాళికను పంపిణీ చేశారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను చేపట్టిందని వారు తెలిపారు. అందులో భాగంగా 15న విజయవాడలో భారీగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే సురేష్‌, చిన్నారి, రాము, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల : ఈ నెల 15న 'ఛలో విజయవాడ' జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు ఏ.జగన్‌ మోహన్‌ రావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రామతీర్థం జంక్షన్‌లో నగర పంచాయతీ కార్మికులతో కలిసి ఆయన ప్రచారం చేశారు. కార్యక్రమంలో నగరపంచాయతీ కార్మికులు బాబురావు, దుర్గారావు, శ్రీను, హరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వంగర : ఛలో విజయవాడ సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎంనాయకులు సిహెచ్‌ రామ్మూర్తి నాయుడు కోరారు. మండలంలో శనివారం జరిగిన ఆటో ప్రచార జాతలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు రమణమూర్తి, శంకర్రావు, అప్పల రాము, సత్యరావు, శ్రీనివాసరావు, కృష్ణారావు, రాజేష్‌, గురువులు పాల్గొన్నారు.
రేగిడి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన నిలిచేది ఒక్క సిపిఎం పార్టీనేనని సిపిఎం నాయకులు వి. రమణమూర్తి, సిహెచ్‌ రామ్మూర్తినాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం మండలంలోని ఉంగరాడ మెట్ట వద్ద 'చలో విజయవాడ' సిపిఎం ప్రజా రక్షణభేరి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆటో ప్రచార జాత నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శంకర్రావు, అప్పలరాము, సత్యారావు, శ్రీనివాసరావు, కృష్ణారావు, రాజేష్‌, గురువులు తదితరులు పాల్గొన్నారు.