
ప్రజాశక్తి- రణస్థలం : నవంబరు 15న చలో విజయవాడను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు వెలమల రమణ, సిహెచ్ అమ్మన్నా యుడు పిలుపునిచ్చారు. సిపిఎం ప్రజా రక్షణ భేరి ఛలో విజయవాడ పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సభకు అత్యధిక ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలన్నారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌లకు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతూ, ప్రజల ఆస్తుల్ని అంబానీ, అదానీలకు దోచిపెడు తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, మూతపడిన పరిశ్రమలు తెరిపించడం, ధరలు అదుపుచేయడం, రైల్వేజోన్, విభజన హామీలు అమలు వంటి వాటితో కూడిన ప్రజాప్రణాళిక సిపిఎం ప్రజల ముందుంచు తుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయుకులు మహాలక్ష్మి నాయుడు పాల్గొన్నారు.ఫోటో:
కొత్తూరు: మండలంలో గొట్టిపల్లి వారపుసంతలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజారక్షణ భేరి విజయవంతం చేయాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నెల 15న ఛలో విజయవాడలో జరుగు బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు వివరించడానికి చేపట్టిన బస్సుయాత్ర విజయవంతం చేయాలన్నారు. ఈ బహిరంగ సభకు సిపిఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, బి.వి.రాఘవులు హాజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నిమ్మక అప్పన్న, జమ్మమ్మ, గోపాల్, గణపతి, రాము, కృష్ణ పాల్గొన్నారు.