Feb 07,2022 10:36

విశాఖ : కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై నేడు చలో కలెక్టరేట్‌ చేపట్టనున్న నేపథ్యంలో ... పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. విశాఖలో ఈ రోజు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్‌కి వినతిపత్రం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిఐటియు నాయకులు వివి.శ్రీనివాసరావు, మణి, తదితర నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.