
ప్రజాశక్తి - లింగసముద్రం :ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్‌పిఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం లింగసముద్రం పంచా యతీలోని జంపాలవారిపాలెంలో నాయకులు కరపత్రాలను విడుదల చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌సి రిజర్వేషన్లు చట్టబద్ధత కల్సిం చాలని కోరుతూ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మాదిగ,ఉప కులాల విశ్వరూప మహసభను నిర్వహిస్తు న్నారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. ఎస్‌సి వర్గీకరణ లక్ష్యసాధన అనేది మాదిగ, ఉపకులాల సుధీర్ఘ ఆకాంక్ష అని తెలిపారు. విశ్వరూప మహసభకు పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి, మండలాల నుండి తరలిరావాలని కోరారు. ఎం ఆర్‌పిఎస్ మండల నాయ కులు కత్తి మధు,కత్తి కిరణ్,కత్తి కిశోర్,పట్రా సురేష్ ఉన్నారు.