Oct 05,2023 22:57

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం పటిష్టంగా అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో 41 సిఆర్‌పిసి నిబంధనలు రద్దు చేయాలని, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలని, కెవిపిఎస్‌ కష్ణాజిల్లా అధ్యక్షులు సిహెచ్‌ సిహెచ్‌ రాజేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దళిత హక్కులు సామాజిక న్యాయం కోసం డిసెంబర్‌ 4న చలో ఢిల్లీ చేసి భారత రాష్ట్రపతికి సంతకాల సేకరణ చేసి వినతి పత్రం అందజేయుట కొరకు కెవిపిఎస్‌ మచిలీ పట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నం నగరంలో 24, 25 డివిజన్‌ లో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రాజేష్‌ మాట్లాడుతూ ఉపాధి చట్టం క్రింద 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, స్మశాన వాటికలో పనిచేస్తున్న కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, గహ నిర్మాణ దళితులకు గహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, కళ్యాణమస్తు పథకం లో దళితులకు పదో తరగతి విద్యార్థి తీసివేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాలో అన్ని దళితపేటలో సంతకాల సేకరణ చేసి డిసెంబర్‌ 4న కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి కి వినతిపత్రం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కొడాలి శర్మ,మచిలీపట్నం నగర అధ్యక్షులు ఎంఏ బెనర్జీ, సిఐటియు జిల్లా కోశాధికారి బూర. సుబ్రహ్మణ్యం మచిలీపట్నం కెవిపిఎస్‌ కమిటీ సభ్యులు నిమ్మకాయల రాజు, శరత్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.