Mar 30,2023 00:08

పంగులూరులో వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పంగులూరు : మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 5న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా రైతు సంఘం కార్యదర్శి తలపనేని రామారావు కోరారు. చలో ఢిల్లీ కార్యక్ర మానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలన్నారు. కేరళ తరహా రైతు రుణమాఫీ చేయాలన్నారు. నిత్యావసర సరుకులు, పేద రైతులకు ఇచ్చే వ్యవసాయ పరికరాలపై జఎష్టఇ ఎత్తివేయాలన్నారు. పెట్రోలు, డీజిల్‌ గ్యాస్‌పై సుంకాలను తగ్గించాలన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2022 రద్దు చేయాలన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎరువుల సబ్సిడీని పెంచాలన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. అన్ని రకాల పంటలకు సమగ్ర భీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సుబ్బారావు ,జాగర్లమూడి బుచ్చయ్య ,జి. శ్రీనివాసరావు, బి. శ్రీనివాసరెడ్డి, జండ్రారాజు పల్లి ఏసేబు, సందిపాగు ఏసేబు, మీరా మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు. బల్లికురవ రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వచ్చేనెల 5న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. బలికురవ ఎస్‌టి కాలనీ వద్ద చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భట్టిప్రోలు : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్‌ 5న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి. వెంకట్రా మయ్య, బి.సుబ్బారావు పిలుపునిచ్చారు. కొల్లూరులో చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టంగుటూరు : అనేక పోరాటాల ద్వారా దక్కించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకొనేందుకు వచ్చేనెల 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చలో ఢిల్లీలో కూలీందరు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ 2001లో ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ. 90వేల కోట్లకు కుదిరించడం దారుణమన్నారు. కార్మికులు అనేక త్యాగాలతో సాధించ ుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ సమిష్టిగా ప్రతిఘటించేందుకు చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వేశపోగు మోజెస్‌ తదితరులు పాల్గొన్నారు. పిసిపల్లి : ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో రూ.2 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఏప్రిల్‌ 5న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మండల పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టానికి నిధులు తగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి మేట్లు గోసా శ్రీదేవి, శేషం నరేష్‌, దోసపాటి మాధవీలత, భోగాల నరసారెడ్డి, పి.కౌసల్య, డి.సింధు, కంచర్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.