అనకాపల్లిలో శంకర్రావు ప్రచారం
ప్రజాశక్తి-యంత్రాంగం:
అనకాపల్లి : బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు రుత్తల శంకర్రావు పిలుపునిచ్చారు. స్థానిక జీవీఎంసీ కార్మికులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గంట శ్రీరామ్, అనిల్, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన గోడ పత్రికను సోమవారం పరవాడ ఫార్మసిటీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మిక, రైతు హక్కుల సాధనకే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే పోతి నాయుడు, పి చిన్నారావు, కేఎం నాయుడు, ఏ రాజా, కె ధారబాబు, సత్తిబాబు, పెంటారావు పాల్గొన్నారు
కె.కోటపాడు : ఏప్రిల్ ఐదో తేదీన జరుగు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు కోరారు. మండల కేంద్రంలో సోమవారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల మండల కన్వీనర్ ఎర్ర దేవుడు, రైతు సంఘం నాయకులు వనము సూర్యనారాయణ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
మాడుగుల: కార్మిక,కర్షకుల సమస్యలను పరిష్కరించాలని ఏప్రిల్ 5న జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఇ.నరసింహ మూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.భవాని కోరారు. సోమవారం మండల కేంద్రంలోని సంత లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకానికి తూట్లు పొడుస్తూ బడ్జెట్లో 30 వేల కోట్ల కోత పెట్టిందన్నారు. 200 రోజుల పని కల్పన, కనీస వేతనం రూ.600 అందని ద్రాక్షగా మారాయని అన్నారు. మోడి విధానాలతో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరగనుందని, దీన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సోమల విజరు, మాదల బాలకృష్ణ, ఈశ్వరమ్మ, లక్ష్మి ,రమణ, వేణుగోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
చీడికాడ :చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండలం కేంద్రంలో సిఐటియు మండల కార్యదర్శి ఆర్.దేముడునాయుడు ఆధ్వర్యంలో గోడ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల, రైతుల, ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో విఫలం చెందిందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన కనీస ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీలో జరిగే కార్మిక - కర్షక పోరాట ప్రదర్శనలో పాల్గొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల్ సంఘం నేతలు గణేష్, నాగరాజు, రమణ, నాగేష్, గ్రామపంచాయతీ కార్మికుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
చలో ఢిల్లీకి బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల మద్దతు
కలెక్టరేట్ : ఏప్రిల్ 5న ఢిల్లీలో చేపట్టే కార్మిక, కర్షక భారీ ర్యాలీకి మద్దతుగా సోమవారం బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన డాబాగార్డెన్స్‌లోని సంస్థ కార్యాలయం ఎదుట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పిఇసిహెచ్‌వి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఉక్కునగరం : కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధమవుతున్న కర్షక కార్మిక వర్గం వచ్చేనెల 5న చలో ఢిల్లీ ఆందోళన జయప్రదం చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్లాంట్‌లోని స్టోర్ జంక్షన్ వద్ద చలో ఢిల్లీ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ దేశానికి సంపద సష్టించే ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను ప్రైవేటుకు దారాదత్తం చేయడం ద్వారా దేశ ఆర్థికవ్యవస్థను కుదేలు పరచాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.స్టీల్ సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ పి శ్రీనివాసరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించే విపక్షాలపై కేంద్రం భౌతికదాడులకు పూనుకోవడం దుర్మార్గమని, ఇలాంటి చర్యలను ఐక్యపోరాటాలతో తిప్పికొట్టేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు గంగాధర్, డి కష్ణమూర్తి, కె వి.సత్యనారాయణ, యు మరిడయ్య, బిఎన్ మధుసూదన్, దేముడు నాయుడు, బి.మహేష్, కె సత్యనారాయణ, సూరిబాబు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, శంకరరావు పాల్గొన్నారు.
ములగాడ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 5వ తేదీన కార్మిక కర్షక సంఘర్ష ర్యాలీ జయప్రదం చేయాలని సిఐటియు వెంకన్న పాలెం కార్యాలయంలో సోమవారం చలో ఢిల్లీ వాల్‌పోస్టర్లను ఆవిస్‌కరించారు. సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తి, అధ్యక్షులు కె.పెంటారావు నాయకులు పి.పైడిరాజు, ఎం.అప్పలనాయుడు నూకరాజు కాటంరావు ఎస్ వాసు సత్యనారాయణ, ఎ.సత్యారావు, సత్యనారాయణ, త్రినాధ్ పాల్గొన్నారు.
భీమునిపట్నం : ఏప్రిల్ 5న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం జివిఎంసి రెండు, మూడు వార్డుల్లోని పలు ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జోన్ అధ్యక్ష ,కార్యదర్శులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, నాయకులు ఎస్ అప్పలనాయుడు, ముఠా కార్మికులు పాల్గొన్నారు










