Apr 05,2023 00:17
చలో ఢిల్లీ కార్యక్రమానికి రైలులో వెళుతున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-పంగులూరు: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి లక్షలాదిమంది ప్రజలు దేశ రాజధానికి చేరుకుంటున్నారని రైతు సంఘం బాపట్ల జిల్లా నాయకు లు తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ మైదానంలో ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ, సిఐటి యు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పలువు రు నాయకులు రైళ్లలో బయలుదేరి వెళ్లారు. ఈపాటికే కొంతమంది ఢిల్లీ నగరానికి చేరుకోగా, మరి కొంతమంది రైళ్లలో ఢిల్లీకి చేరువలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంద ర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు బత్తుల హను మంతరావు 'ప్రజాశక్తి'తో మొబైల్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ ప్రయాణం విశేషాలను తెలియజేశారు. చలో ఢిల్లీ కార్యక్ర మానికి విజయవాడ నుంచి రైల్లో బయలుదేరి వెళుతుండగా, ఆ రైల్లోనే ఉన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు నాయకులు కలిశారని, ప్రయాణం ఉత్సాహంగా సాగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు, ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఏ విధం గా ఇబ్బంది పడుతున్నారో తమకు చెప్పారని అన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో రైతులు, కూలీలు, కార్మికులు హాజరవుతున్నారని బత్తుల హనుమంతరావు తెలిపారు. రాష్ట్రాలు, భాషలు వేరైనా ఆశయం ఒకటే కావడంతో తామంతా ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రయాణిస్తున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన చెప్పారు. రైతు సంఘం జెండాలు చేత పట్టుకొని నినాదాలు చేసుకుంటూ ఈ ప్రయాణంలో రైతు సంఘం మార్టూరు మండల నాయకులు బత్తుల హనుమంతరావు, సాంబయ్య, వీరవల్లి కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, హనుమంతరావు, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, సిఐటియు పంగులూరు మండల కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.