Mar 24,2023 21:02

ప్రజాశక్తి - భీమడోలు
            వచ్చేనెల ఐదో తేదీన చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌలు రైతుల సంఘం మండల కన్వీనర్‌ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించే కార్మిక, కర్షక ఐక్య ర్యాలీ ప్రచార కరపత్రాల పంపిణీని పూళ్లలో శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన శ్రీరామచంద్రమూర్తి గ్రామపంచాయతీ పరిధిలోని పలు ఆవాస ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలిశారు. చలో ఢిల్లీ కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. పలువురు రైతులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు రంగారావు, అల్లు శ్రీనివాసరావు, నోచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉంగుటూరు : కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వచ్చేనెల ఐదో తేదీన చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మిక - కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొక్కిరపాటి వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోండ్రు చిన్నఅంజయ్య, కె.అశోక్‌, పెండెం ప్రసాదరావు, కె.వెంకట్రావు, కె.మారియ్య పాల్గొన్నారు.
నిడమర్రు: చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు, వ్యవసాయ కార్మికసంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిడమర్రులో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు, రైతు సంఘం నాయకులు కోన శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గవర సత్యనారాయణ, లావేటి చంద్రరావు, కంచ వరప్రసాద్‌, చింతల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ముసునూరు : మండలంలోని ముసునూరు, గోపవరం, యల్లాపురం గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూలీలకు చలో ఢిల్లీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు పిల్లి మురళీ పాల్గొన్నారు.
కలిదిండి : వచ్చేనెల ఐదో తేదీన జరిగే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ ఉద్యోగ, కార్మిక, ప్రజలకు పిలుపునిచ్చారు. కలిదిండిలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడ పత్రికను ఆవిష్కరించారు. గ్రామాల్లో కరపత్రాల పంపిణీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేషపు మహంకాళిరావు, జక్కుల మహేష్‌, పెరుమాళ్ల సత్యనారాయణ, వెంకటేశ్వరారావు, రైతు సంఘం నాయకులు వీరవల్లి భాస్కరరావు, సాంబయ్య పాల్గొన్నారు.