ప్రజాశక్తి-చందర్లపాడు: ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే కార్మిక, కర్షక ర్యాలీని జయప్రదం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చందర్లపాడు సెంటర్‌లో గోడపత్రికను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ హుస్సేన్, సిఐటియు నాయకులు వేల్పుల ఏసోబు, తోటరామారావు, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఎ.కొండూరు: చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో చీమలపాడు గ్రామంలో సోమవారం పోస్టర్ ఆవిష్కరణ, కరపత్రాలు పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. శివనాగరాణి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినాక ప్రజా సంపదనంతా కార్పొరేట్లకు దోచిపెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి పానెం ఆనందరావు, రైతుసంఘం మండల కార్యదర్శి ఆళ్ల అమ్మిరెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు రామకృష్ణ, టి విజయలక్ష్మి, గోపిరాజు, సోములు, యోహాను, మరియమ్మ పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: నందిగామలో వాల్ పోస్టర్లను సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కె.గోపాల్, సలికేటి నరేష్, పి.మాణిక్యం, పిచ్చయ్య, నథనియేలు, గరికపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజాశక్తి-మైలవరం: స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి, న్యాయవాది ఆర్ రమేష్, సిఐటియు మండల అధ్యక్షులు ఆర్వి పుష్పకుమారి, మండల ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్, పత్తిపాటి జ్యోతి, రావుల సుబ్బారావు, సిహెచ్ సుబ్బారెడ్డి, వజ్రాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మండల సీఐటీయూ కార్యదర్శి దారా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం యాదవ్ బజార్‌లో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు నరసింహారావు, మల్లయ్య, తిరుపతిరావు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడరూరల్: గ్రామపంచాయతీ కార్మికులకు రూ.20 వేలు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సిహెచ్.శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్లపూడి గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు పియఫ్ , ఈఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. ఏప్రిల్ 5 ఛలో ఢిల్లీ క్యాంపెయిన్ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగం సంస్థలు పరిరక్షణ, కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు నిత్యావసరాల ధరలు తగ్గించాలని, రైతాంగం కు మద్దతు ధరలు చట్టం తేవాలని, రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాలని , మోటారు రవాణా సవరణ చట్టం రద్దు చేయాలని కోరుతూ ఏప్రిల్ 5 ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు విజయవాడ మండల కార్యదర్శి టి.నరసింహారావు, యుటీఎఫ్ నాయకులు సంజీవరెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: వత్సవాయి మండల కేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బి రాము, చిర్రా ప్రసాద్, సిహెచ్ కృష్ణ, బజార్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: పటమట ఈ సేవా సెంటర్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈసందర్భంగా కృష్ణాజిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నగర అధ్యక్షులు వి.బి.రాజు, నాయకులు హరికృష్ణ, వి.శ్రీను, బి.శ్రీను, అప్పలనాయుడు పాల్గొన్నారు.










