Mar 30,2023 00:19

హుకుంపేటలో చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కొయ్యూరు
కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏప్రిల్‌ 5న జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు వై.అప్పలనాయుడు పిలుపునిచ్చారు. మండలంలోని ముల్లుమెట్ట గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా దానికి బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ వస్తుందని తెలిపారు. ఈ ఏడాది రూ.30 వేల కోట్లు కోత పెట్టిందన్నారు. దీనివల్ల గ్రామీణ కూలీలకు పని లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పి.బొంజన్న, జె.శివశంకర్‌, జర్సింగి ప్రవీణ్‌, బి.కృష్ణ, బి.నాగేష్‌, తులబడ ప్రసాద్‌, చిట్టిన్న తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు పోతురాజు పిలుపునిచ్చారు. బుధవారం అరకు వేలి గిరిజన సంఘం కార్యాలయంలో సిఐటియు మండల నాయకులు పాడి కొండలరావు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు పోతురాజు మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కే మగ్గన్న, సింహాద్రి, రాజు, సుందర్‌రావు, బాలన్న, చిన్ని, ఆనంద్‌ పాల్గొన్నారు.
హుకుంపేట : ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ కార్యక్రమంలో కర్షకులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వెలుగు సిబ్బంది కోరారు. స్థానిక వెలుగు కార్యాలయం వద్ద వెలుగు సిబ్బంది బుధవారం పోస్టర్లు విడుదల చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పిఎఫ్‌, పెన్షన్స్‌ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల నేతలు . పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.