Mar 15,2023 22:49

ప్రజాశక్తి-తిరువూరు : ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పా టుచేయాలని, పెట్రో ల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు, పన్నులు తగ్గిం చాలని తదితర డిమాండ్లతో ఏప్రిల్‌ 5వ తేదీన నిర్వ హించనున్న ఛలో ఢిల్లీ కార్య క్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు నా యకులు ఎస్వీ.భద్రం, బి.వెంకటేశ్వర రావు ఆటో కార్మికులకు పిలుపునిచ్చా రు. తిరువూరు బోసుబొమ్మ బస్టాప్‌ ఆటోస్టాండ్‌ సెంటర్‌ లో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఛలో ఢల్లీీ కరపత్రాలను యూనియన్‌ నాయకు లతో కలిసి బుధవారం వారు విడుదల చేశారు. ఈకార్యక్రమంలో యూని యన్‌ పట్టణ కార్యదర్శి పర్వతం శ్రీనివా సరావు పాల్గొన్నారు.