Sep 07,2023 20:21

సబ్‌ జైలులో చల్లా బాబును పరామర్శించడానికి వెళుతున్న వాసు, జగన్‌మోహన్‌రాజు

  కడప అర్బన్‌ పుంగనూరు అల్లర్ల ఘటనలో కడప జైలులో రిమాండ్‌లో ఉన్న పుంగనూరు టిడిపి ఇన్‌ఛార్జీ చల్లా బాబును టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు ఆర్‌. శ్రీనివాసరెడ్డి (వాసు) పరామర్శించారు. గురువారం కడప కేంద్ర కారాగారానికి చేరుకుని చల్లా బాబుతో పాటు వారి కుటుంబ సభ్యులతో వాసు మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వాసు మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు ఎన్నటికీ నిలబడవని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం టిడిపి నాయకులపై కేసులు పెట్టి వేధిస్తుందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి రాగానే కేసుల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట టిడిపి నాయకులు జగన్‌మోహన్‌రాజు, నాయకులు పాల్గొన్నారు.