May 24,2023 00:39

చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న సర్పంచి

ప్రజాశక్తి - పంగులూరు : వేసవిలో బాటసారుల దాహర్తీని తీర్చేందుకు బయట మంజులూరు సమీపంలో జాతీయ రహదారిపై ధర్మ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు చక్రవరం రంగరాజు, వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచి చక్రవరం రుక్మిణి తిరుమల రాజు తెలిపారు. వేసవి కాలం ముగిసే వరకూ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచి తెలిపారు. చలివేంద్రాన్ని పాదచారులు, బస్సులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులు ఉపయోగించుకోవాలన్నారు. తన తల్లిదండ్రులు పేరుతో, తమ సొంత నిధులతో ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నట్లు రుక్మిణి తిరుమల రాజు చెప్పారు.